COVID19 CRISIS SUPPORT SCHOLARSHIP PROGRAM FOR STUDENTS EVK
Scholarship program: కరోనా కారణంగా చదువుకొనేందుకు ఇబ్బందా.. అయితే స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా కారణంగా చదువుకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులను ఆదుకొనేందుకు కోవిడ్ క్రైసిస్(జ్యోతి ప్రకాశ్) స్కాలర్షిప్(Scholarship) ప్రోగ్రాం నిర్వహిస్తోంది. కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాల్లోని విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
కరోనా కారణంగా చదువుకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులను ఆదుకొనేందుకు కోవిడ్ క్రైసిస్(జ్యోతి ప్రకాశ్) స్కాలర్షిప్(Scholarship) ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కరోనా కారణంగా తల్లిదండ్రులకు దూరమైన వారు, ఇంటి పెద్దను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు, లేదా కుటుంబ పెద్ద కరోనా(Corona) తర్వాత ఉద్యోగం కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం అందించనున్నారు. విద్యార్థుల చదువుకు అవసరమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది.
అర్హతలు..
- ఇది కేవలం భారతీయ విద్యార్థులకు మాత్రమే.. 1వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్(Graduation) చదవే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- కుటుంబ పెద్దను, తల్లిదండ్రులను కోల్పోయిన వారు, ఇంటి పెద్ద జనవరి ,2020 తర్వాత ఉద్యోగం కోల్పోయి ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు
స్కాలర్షిప్ బెన్ఫిట్స్
ఎనిమిదో తరగతి లోపు విద్యార్థులకు రూ. 9,000 సంవత్సరానికి
తొమ్మిది పదోతరగతి విద్యార్థులకు రూ. 12,000
11, 12 తరగతి విద్యార్థులకు రూ. 15,000
గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు రూ. 18,000 నుంచి రూ.30,000
దరఖాస్తు చేసుకొనే విధానం..
- కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థి ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. (వెబ్సైట్ కోసం క్లిక్ చేయండి)
- అప్లే బటన్పై క్లిక్ చేసి మీ వివరాలు అందించి సబ్మిట్(Submit) చేయాలి
- అర్హులైన విద్యార్థలను మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2021
అనుమానాలు.. దరఖాస్తు సమస్యల కోసం సంప్రదించాల్సి నంబర్లు
011-430-92248 (Ext - 180)
(Monday to Friday - 10:00AM to 6PM)
ccss@buddy4study.com
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.