COVID 19 LIKELY TO KEEP INDIAN WOMEN UNEMPLOYED FOR YEARS HERE FULL DETAILS NS GH
Unemployment: కరోనా దెబ్బకి మరింత దయనీయంగా ఆ కార్మికుల పరిస్థితి.. భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?
ప్రతీకాత్మక చిత్రం
కరోనా అనంతరం మహిళ ఉపాధి అవకాశాలు మరింత దిగజారాయని తాజా నివేదికలు చెబుతున్నాయి. గత దశాబ్దంలో భారతీయ మహిళలు సాధించిన సామాజిక, ఆర్ధిక లాభాలు కరోనా సమయంలో తుడిచిపెట్టుకు పోయాయని వెల్లడిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఉపాధి మార్గాలను దెబ్బతీసింది. అయితే కోవిడ్ తరువాత మహిళ ఉపాధి అవకాశాలు మరింత దిగజారాయని తాజా నివేదికలు చెబుతున్నాయి. భారత్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో చాలామంది అంతగా నైపుణ్యాలు అవసరం లేని పొలం, ఫ్యాక్టరీ తదితర పనులలో కొనసాగుతున్నారు. అయితే ఈ రంగాలపై కరోనా వైరస్ తీవ్రమైన ప్రభావం చూపింది. ఫలితంగా చాలామంది మహిళలు ఉపాధి కోల్పోయారు. గత దశాబ్దంలో భారతీయ మహిళలు సాధించిన సామాజిక, ఆర్ధిక లాభాలు కరోనా సమయంలో తుడిచిపెట్టుకు పోయాయని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ వెల్లడించారు. మహిళలు అనధికారిక రంగాలలో కొనసాగుతున్నారు కాబట్టి ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారో అంచనా వేయడం కూడా కష్టతరంగా మారింది. సమగ్ర సంక్షేమ వ్యవస్థ, మహమ్మారి సంబంధిత మద్దతు లేకపోవడం వల్ల చిన్న, మధ్యతరగతి వ్యాపారాలపై ప్రభావం పడింది. VSSC Recruitment 2021: విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో 158 జాబ్స్... ఈరోజే లాస్ట్ డేట్ AP Job Mela: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో పది కంపెనీల్లో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
దీనివల్ల కంపెనీల యజమానులు అవసరం లేని ఉద్యోగులను తొలగించారు. వీరిలో 60% మంది మహిళలే ఉండటం గమనార్హం. అజీమ్ ప్రేమ్జీ యూనివర్శిటీకి చెందిన సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ నివేదిక ప్రకారం, మార్చి-డిసెంబర్ మధ్య కాలంలో 47% మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ మహిళా కార్మికులు ఏప్రిల్లో సెకండ్ వేవ్ విజృంభించకముందే అవసరం లేని ఉద్యోగులుగా మారిపోయారు. ఇక వీరికి ఉద్యోగాలు లభిస్తాయన్న సూచనలు కూడా కనిపించడం లేదు.
ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్.. ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోని 50 మందికి పైగా మహిళలతో ఫోన్ ద్వారా మాట్లాడింది. అయితే వారిలో అందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలిపారు. చిన్న వస్త్ర కర్మాగారాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రావెల్ ఏజెన్సీలు, పాఠశాలల్లో పనిచేస్తున్న తామంతా ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయామని మహిళలు వెల్లడించారు. దేవి అనే ఒక మహిళ మాట్లాడుతూ తాము పాలు, దుస్తులు తదితర వాటిపై పెట్టే ఖర్చులను తగ్గించుకున్నామని వెల్లడించారు.
ఢిల్లీలోని ఓఖ్లా వస్త్రాలు, ఆటో విడిభాగాలు, ఫుడ్ ప్యాకేజింగ్ తయారీదారులకు నిలయం అని అంటారు. అయితే ఆర్డర్లు తగ్గిపోవడం.. రవాణా, ఉక్కు ఖర్చులు పెరగడంతో తమ ఉద్యోగులను దాదాపుగా సగం వరకు తొలగించామని ఓఖ్లా యజమానులు తెలిపారు. తమ వ్యాపారాలను స్టార్ట్ చేసిన తర్వాతనే ప్యాకేజింగ్ పనులు ప్రారంభమవుతాయని.. అప్పుడు మహిళకు జాబ్స్ ఇచ్చే ఆలోచన చేస్తామని మరొక యజమాని చెప్పుకొచ్చారు.
ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నామని మహిళలు చెబుతున్నారు. దూరప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చినప్పటికీ.. పిల్లల తల్లులు వదులుకుంటున్నారు. దూరప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తే పిల్లల ఆలనాపాలన ఎవరు చూసుకుంటారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.