హోమ్ /వార్తలు /jobs /

Online Courses: కోవిడ్ తరువాత ఈ కోర్సులకు పెరిగిన ఆదరణ.. 2021లో టాప్ ట్రెండింగ్ కోర్సులు ఇవే.. 

Online Courses: కోవిడ్ తరువాత ఈ కోర్సులకు పెరిగిన ఆదరణ.. 2021లో టాప్ ట్రెండింగ్ కోర్సులు ఇవే.. 

2021 కరోనా కాలంలో కాలేజీలు, యూనివర్సిటీల భౌతిక క్లాసులు నిర్విరామంగా సాగలేదు. కరోనా భయంతో చాలామంది విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఆన్‌లైన్‌ ద్వారానే విద్యనభ్యసించారు. ఈ నేపథ్యంలో అత్యంత సులభంగా ఇంటి నుంచే యాక్సెస్ చేయగల చాలా ఆన్‌లైన్‌ కోర్సులకు విద్యార్థులు ఆకర్షితులయ్యారు.

2021 కరోనా కాలంలో కాలేజీలు, యూనివర్సిటీల భౌతిక క్లాసులు నిర్విరామంగా సాగలేదు. కరోనా భయంతో చాలామంది విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఆన్‌లైన్‌ ద్వారానే విద్యనభ్యసించారు. ఈ నేపథ్యంలో అత్యంత సులభంగా ఇంటి నుంచే యాక్సెస్ చేయగల చాలా ఆన్‌లైన్‌ కోర్సులకు విద్యార్థులు ఆకర్షితులయ్యారు.

2021 కరోనా కాలంలో కాలేజీలు, యూనివర్సిటీల భౌతిక క్లాసులు నిర్విరామంగా సాగలేదు. కరోనా భయంతో చాలామంది విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఆన్‌లైన్‌ ద్వారానే విద్యనభ్యసించారు. ఈ నేపథ్యంలో అత్యంత సులభంగా ఇంటి నుంచే యాక్సెస్ చేయగల చాలా ఆన్‌లైన్‌ కోర్సులకు విద్యార్థులు ఆకర్షితులయ్యారు.

ఇంకా చదవండి ...

  2021 కరోనా కాలంలో కాలేజీలు, యూనివర్సిటీల భౌతిక క్లాసులు నిర్విరామంగా సాగలేదు. కరోనా భయంతో చాలామంది విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఆన్‌లైన్‌ ద్వారానే విద్యనభ్యసించారు. ఈ నేపథ్యంలో అత్యంత సులభంగా ఇంటి నుంచే యాక్సెస్ చేయగల చాలా ఆన్‌లైన్‌ కోర్సులకు విద్యార్థులు ఆకర్షితులయ్యారు. ఈ ఏడాది కొత్తగా కొన్ని కోర్సులు విద్యార్థులను బాగా ఆకట్టుకున్నాయి. 2021 సంవత్సరం అంతటా ఇవి టాప్ ట్రెండింగ్ కోర్సులుగా నిలిచాయి. 2021 ముగుస్తున్న నేపథ్యంలో సంవత్సర కాలంలో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న వర్ధమాన కోర్సులు ఏవో చూద్దాం.

  1. అకడెమిక్ రైటింగ్ (Academic Writing)

  ప్రముఖ స్వయం (SWAYAM) సర్టిఫికేట్ కోర్సులలో అకడెమిక్ రైటింగ్ కోర్సు అనేది ఒకటి. ఈ కోర్సు ఎఫెక్టివ్, రిజల్ట్ ఓరియెంటెడ్ అకడెమిక్ రైటింగ్స్ కోసం విద్యార్థులకు పరిజ్ఞానం అందిస్తుంది. ఎడ్యుకేషన్ గ్యాప్ తగ్గించడానికి ఈ కోర్సును తీసుకొచ్చారు. ఇది ఒక ఫౌండేషన్ లెవెల్ కోర్సు. ఇందులో జాయిన్ అయిన అభ్యర్థులు ఒక సబ్జెక్టులో తాము చేసే పరిశోధనల ఆధారంగా తమ అకడెమిక్ రైటింగ్ ను మెరుగుపరచుకోవచ్చు.

  Amazon year end sale: అమెజాన్ ఇయర్​ ఎండ్ సేల్​ ప్రారంభం.. ఆ స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..

  ఈ కోర్సు వ్యవధి 15 వారాలు. ఈ కోర్సు ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ప్రీ-పీహెచ్‌డీ కోర్సులకు అనుగుణంగా ఉంటుంది. ఈ కోర్సును స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరింగ్ మైండ్స్ (SWAYAM) ఆఫర్ చేస్తోంది.

  2. డిజిటల్ మార్కెటింగ్ కోర్సు

  ఇంటర్నెట్, ఆన్‌లైన్ యాక్టివిటీస్ విపరీతంగా పెరిగిపోవడంతో డిజిటల్ మార్కెటింగ్‌కు డిమాండ్ పెరిగింది. డిజిటల్ మార్కెటింగ్‌లో కంటెంట్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (SEO), సోషల్ మీడియా, మార్కెటింగ్ అనలిటిక్స్ వంటి అంశాలు ఉంటాయి. వీటికున్న డిమాండ్‌తో విద్యార్థులు డిజిటల్ మార్కెటింగ్ కోర్సుల వైపు మొగ్గు చూపారు.

  3. పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్

  పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ కోర్సు అనేది స్వయం ఆన్‌లైన్ కోర్సులలో ఒకటి. ఇది శాంతి భావన, మానవ అభివృద్ధిలో శాంతి పాత్రను బోధిస్తుంది. సిద్ధాంతాలు, కాన్‌ఫ్లిక్ట్ రకాలు, కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ పద్ధతులు, శాంతికి సంబంధించిన సమకాలీన కార్యక్రమాల ప్రాధాన్యతలను కూడా అభ్యర్థులకు పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్‌ కోర్సు నేర్పిస్తుంది.

  Narendra Modi: మోదీ కాన్వాయ్​లో కొత్త లగ్జరీ కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!

  4. బ్లాక్‌చెయిన్ కోర్సులు

  బ్లాక్‌చెయిన్ కోర్సులు టెక్నికల్, నాన్-టెక్నికల్ అభ్యాసకుల కోసం ఉద్దేశించినవి. కేరళ బ్లాక్‌చెయిన్ అకాడమీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిజిటల్ యూనివర్శిటీ కేరళ కింద బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో రెండు ఫండమెంటల్ ప్రోగ్రామ్స్ ను ఫ్రీగా అందించింది.

  5. రోబోటిక్స్

  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు అందించే స్వయం ఫ్రీ ఆన్‌లైన్ కోర్సులలో రోబోటిక్స్ కోర్సు ఒకటి. దీన్ని ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసిన విద్యార్థులతోపాటు మాస్టర్స్ విద్యార్థుల కోసం తీసుకొచ్చారు. ఇంజినీరింగ్‌లోని అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగాలు చేసే ఇంజనీర్లు స్వయంలో రోబోటిక్స్‌ కోర్సుల్లో జాయిన్ కావచ్చు. రోబోటిక్స్ కోర్సు వ్యవధి ఎనిమిది వారాలు.

  6. కోవిడ్-19 కాంట్రాక్ట్ ట్రేసింగ్

  కోవిడ్-19 కాంట్రాక్ట్ ట్రేసింగ్‌పై తీసుకొచ్చిన కోర్సులు ఈ ఏడాదిలో బాగా ఆదరణ దక్కించుకున్నాయి. వైద్యులు, నర్సులు, ఇతర హెల్త్‌కేర్ నిపుణుల కోసం ఈ కోర్సులను తీసుకురావడం జరిగింది. ఇది అభ్యర్థులకు కోవిడ్ బారిన పడిన రోగుల ప్రాణాలను కాపాడడానికి యూనిఫైడ్, ఎవిడెన్స్ బేస్డ్ విధానాన్ని నేర్పిస్తుంది.

  Flipkart 2021 Year End Sale: ప్రారంభమైన ఇయర్ ఎండ్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్లు.. ఈ ఆఫర్లు రెండు రోజులే..

  7. లాంగ్వేజెస్

  సరికొత్త భాషలను నేర్చుకునేందుకు, తమ భాషల పరిజ్ఞానానికి పదును పెట్టుకునేందుకు చాలామంది లాంగ్వేజ్ కోర్సుల్లో జాయిన్ అయ్యారు. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం విదేశీ భాషలను నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ ఎలాస్టిసిటీ మెరుగుపడుతుందని తేల్చింది. అలాగే కొత్త భాష నేర్చుకుంటే ఇన్ఫర్మేషన్ కోడ్ చేయడం సులభతరం అవుతుందట. బ్రెయిన్ పవర్ పెంచుకునేందుకు చాలా మంది కొత్త భాష నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఈ ఏడాదిలోనూ లాంగ్వేజెస్ కోర్సులు టాప్ ట్రెండింగ్ జాబితాలో ఒకటిగా నిలిచాయి.

  8. డేటా సైన్స్

  2021లో డేటా సైన్స్ కోర్సులు హవా నడిచింది. డేటా సైన్స్‌లోని కోర్సులు వివిధ సోర్స్‌ల నుంచి డేటా లేదా సమాచారాన్ని విశ్లేషించడంలో.. సమర్థవంతమైన పరిజ్ఞానం పొందడంలో కూడా విద్యార్థులకు సహాయపడతాయి. ఢిల్లీ, మద్రాసుతో సహా పలు ఐఐటీ సంస్థలు డేటా సైన్స్ కోర్సులు ఆఫర్ చేశాయి.

  First published:

  ఉత్తమ కథలు