CORPORATE EXPERIENCE INTERNSHIP PROGRAM FROM SPORTS BRAND PUMA OPPORTUNITY FOR CANDIDATES TO MASTER MARKETING GH VB
Puma: స్పోర్ట్స్ బ్రాండ్ పూమా నుంచి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్.. అభ్యర్థులు మార్కెటింగ్‌పై పట్టు సాధించే అవకాశం..
(ప్రతీకాత్మక చిత్రం)
ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ‘పూమా’ 15 నుంచి 20 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ‘కార్పొరేట్ ఎక్స్పీరియన్స్’ పేరుతో చేపడుతున్న ఈ ప్రోగ్రామ్‌కు ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ ‘మైండ్లర్’ సహకారం అందించనుంది.
ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్(Sports Brand) ‘పూమా’ 15 నుంచి 20 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను(Internship) ప్రారంభించింది. ‘కార్పొరేట్ ఎక్స్పీరియన్స్’ (Corporate Experience) పేరుతో చేపడుతున్న ఈ ప్రోగ్రామ్‌కు ప్రముఖ ఎడ్టెక్ (EdTech) కంపెనీ ‘మైండ్లర్’ సహకారం అందించనుంది. ఈ ప్రోగ్రామ్‌లో చేరినవారు PUMA నుండి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్(Certificate) పొందనున్నారు. నెల రోజుల పాటు జరిగే కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ పోగ్రామ్ హైబ్రిడ్ ఫార్మాట్లో(Hybrid Format) జరగనుంది. ఇక్కడ విద్యార్థులు వారి సౌలభ్యాన్ని బట్టి సొంతంగా కాన్సెప్ట్‌లను నేర్చుకోవచ్చు. ఇందుకోసం మైండ్లర్, PUMA నుండి పరిశ్రమ నిపుణులు లైవ్ సెషన్ల ద్వారా గైడెన్స్ ఇవ్వనున్నారు.
మైండ్లర్ ఇటీవల Immrse ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేసింది. దాని వ్యవస్థాపకుడు ప్రథమ్ సుతారియా ఈ ఇంటర్న్ షిప్ గురించి ఇలా స్పందించారు. “కార్పొరేట్లు ఎలా పని చేస్తాయో అర్థం చేసుకోవడానికి, పరిశ్రమ నాయకుల నుండి కీలకమైన నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలను విద్యార్థులు పొందేందుకు ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనుకుంటున్నాం. మా సహకారంతో PUMA తన ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేస్తుంది, ప్రకటన ప్రచారాలను ఎలా రూపొందిస్తుందో అవగాహన చేసుకోవడానికి విద్యార్థులకు ఇది మంచి అవకాశం.’’ అని అన్నారు.
పూమా ఇండియా రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశాల్ గుప్తా మాట్లాడుతూ... చిన్న వయస్సులోనే సాంకేతికతతో కూడిన ప్రచారాలలో నైపుణ్యం కోసం విద్యార్థులను సన్నద్ధం చేయడం వారిని మంచి స్థితిలో ఉంచుతుందన్నారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికి తీసి పెంపొందించడానికి PUMA కృషి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రోగ్రామ్‌కు సంబంధించి ఉచిత ఓరియంటేషన్ సెషన్ కోసం విద్యార్థులకు ప్రత్యేక ఆహ్వానం ఉంది. ఈ సెషన్‌ను PUMA, మైండ్లర్ల నిపుణులు ఆర్గనైజ్ చేయనున్నారు. మైండ్లర్ అధికారిక వెబ్సైట్ నుండి ఓరియంటేషన్ సెషన్ కోసం విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
సాధారణంగా ఇంటర్న్‌షిప్ ద్వారా మనం స్కిల్స్ పెంచుకోవడం లేదా ఉద్యోగానికి అవసరమైన నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కొంత మొత్తంలో నగదు స్టైఫండ్ రూపంలో కూడా వస్తుంది. అయితే సోషల్ సర్వీస్‌లో భాగంగా కొన్ని ఎన్జీవోలు ఇంటర్న్‌షిప్‌లను నిర్వహిస్తున్నాయి. తద్వారా ఇందులో భాగస్వామ్యం కావచ్చు. స్టైఫండ్ కూడా ఇస్తారు. మరి ఈ జాబితాను పరిశీలిద్దాం.
సూపర్‌హ్యూమన్ రేస్‌లో అవుట్‌రీచ్, ఎంగేజ్మెంట్ ఇంటర్న్‌షిప్
ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఐదు నెలలపాటు జరగనుంది. ఈ మేరకు సూపర్ హ్యూమన్ రేస్.... ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వర్క్ ఫ్రం హోం మోడల్లో ఈ ప్రోగ్రామ్‌ను చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులు సామాజిక సేవలో సహకారం కోసం కొత్త ఎన్జీవోలను గుర్తించడం, ఈవెంట్ల కోసం కొత్త తరహా ఐడియాలను పరిచయం చేయడం, వీటితో పాటు కార్పొరేట్ ఉద్యోగుల దరికి చేరడం వంటి బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 5,000 నుండి రూ.10,000 వరకు స్టైఫండ్ లభిస్తుంది. మే19 తేదీలోపు ఇంటర్న్‌షాలా ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఉమెనిటీ నిధుల సేకరణ ఇంటర్న్‌షిప్
వారం రోజుల పాటు నిధుల సమీకరణ ఇంటర్న్‌షిప్ కోసం ఉమెన్నిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్‌లో కూడా అందుబాటులో ఉంది. నిధుల సేకరణను పెంచడానికి కొత్త ఆలోచనలు, వ్యాపార అవకాశాలను రూపొందించడం వంటి టాస్క్‌లను ఎంపికైన అభ్యర్థులకు ఇవ్వనున్నారు. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఉమెన్నిటీ సర్టిఫికేట్ అందజేస్తుంది. ఇంటర్న్‌షాలా ద్వారా ఆన్లైన్లో మే 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.