హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Eamcet 2020: ఏపీలో ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా

AP Eamcet 2020: ఏపీలో ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా

లాసెట్ అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 5 వరకు

లాసెట్ అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 5 వరకు

ఏపీలో ఇప్పటి వరకు 31,103 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా నుంచి 16,464 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 365 మంది మరణించారు.

ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది. ఎంసెట్‌ను సెప్టెంబరు మూడో వారంలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 8 సెట్లకు (ఉమ్మడి ప్రవేశ పరీక్షలు) సంబంధించి కొత్త తేదీలను త్వరలోనే ప్రటిస్తామని వెల్లడించారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్క్‌ల ఆధారంగా అందరినీ పాస్ చేసింది.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జూలై 31 వరకు అన్ని కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. జూలై నెలాఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవకూడదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఐతే డిగ్రీ పరీక్షలను మాత్రం ఖచ్చితంగా నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు వస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోలేని పరిస్థితి నెలకొంది.

ఏపీలో ఇప్పటి వరకు 31,103 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా నుంచి 16,464 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 365 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 14,274 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక పరీక్షల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 19,247 శాంపిల్స్ పరీక్షించగా.. 1,919 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11,73,096 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది

First published:

Tags: Andhra Pradesh, AP EAMCET 2020, AP News, Coronavirus, Covid-19

ఉత్తమ కథలు