కరోనా కష్టకాలం... 61 శాతం కొత్త ఉద్యోగాలకు గండి... నో రిక్రూట్‌మెంట్స్...

Corona Lockdown | Corona Update : ఇండియా ఇప్పుడున్న పరిస్థితిని... జనవరికి ముందు ఉన్న పరిస్థితితో పోల్చితే... అది స్వర్ణయుగం అనుకోవాలేమో...

news18-telugu
Updated: June 10, 2020, 11:00 AM IST
కరోనా కష్టకాలం... 61 శాతం కొత్త ఉద్యోగాలకు గండి... నో రిక్రూట్‌మెంట్స్...
కరోనా కష్టకాలం... 61 శాతం కొత్త ఉద్యోగాలకు గండి... నో రిక్రూట్‌మెంట్స్...
  • Share this:
Corona Lockdown | Corona Update : భారత్‌లో మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నట్లైతే... మీరు అదృష్టవంతులు కింద లెక్క. ఎందుకంటే... కరోనా లాక్‌డౌన్ వచ్చాక... కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలూ పోవడమే కాదు... కొత్త ఉద్యోగాల నియామకాలు కూడా 61 శాతం తగ్గిపోయాయి. ఇదంతా మే నెలలోనే జరిగింది. మన దేశంలో ఫ్రిబ్రవరి 15న తొలిసారి మూడు కరోనా కేసులు కేరళలో వచ్చాయి. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం మార్చి వరకూ కనిపించలేదు. ఏప్రిల్‌లో లాక్‌డౌన్ అమల్లో ఉండటం, పొడిగించడం వంటివి చేశాక... అప్పుడు అసలైన సమస్య మొదలైంది. మేలో ఆ ప్రభావం మరింత పెరిగింది. జూన్‌లో లాక్‌డౌన్ నిబంధనల్ని సడలించారు కాబట్టి... కొంత పరిస్థితి మెరుగవుతుందనే అంచనా ఉన్నా... కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

2019 మే నెలలో 2,346 పోస్టుల భర్తీ జరిగింది. ఈ సంవత్సరం మేలో 910 పోస్టుల భర్తీ మాత్రమే జరిగినట్లు నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ తెలిపింది. నౌకరీ డాట్‌ కామ్‌ పోర్టల్‌లో ఉద్యోగ నోటిఫికేషన్ల నమోదు ఆధారంగా ఈ సంస్థ నెలవారీగా నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ లెక్కల్ని రిలీజ్ చేస్తోంది. మేలో హోటల్‌ సెక్టార్‌లో 91%, రెస్టారెంట్‌ రంగంలో 87%, ఆటో, ఆటో విడిభాగాల తయారీ రంగంలో 76%, BFSI విభాగంలో 70% కొత్త ఉద్యోగ నియామకాలు జరగలేదు.

కోల్‌కతాలో 68 శాతం, ఢిల్లీలో 67 శాతం, ముంబైలో 67 శాతం కొత్త ఉద్యోగ ఆఫర్లు తగ్గిపోయాయి. ట్రైనీగా చేరే ఉద్యోగాల్లో కూడా 66 శాతం తగ్గుదల నమోదైంది. దీన్ని బట్టీ మనకు అర్థమయ్యేది ఒకటే. ఇండియాలో ఇప్పుడు అనుకూల పరిస్థితులు లేవు. ఉన్న ఉద్యోగం కొనసాగితే గొప్పే అనే పరిస్థితి ఉంది. మినహాయింపుల తర్వాతైనా దేశంలో ఆర్థిక వ్యవస్థ జోరందుకుందా అంటే లేదనే అంటున్నారు. ఎందుకంటే... ప్రజల్లో కరోనా వ్యాప్తిపై బాగా అవగాహన ఉంది. అందుకే వాళ్లంతట వాళ్లే ఇళ్లలోంచి బయటకు రావట్లేదు. షాపులు తీసినా, రెస్టారెంట్లు తెరిచినా... ఇప్పుడే వెళ్లొద్దు... అని ఇంట్లోనే సర్దుకుపోతున్నా్రు. ఈ పరిస్థితి వల్ల జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో కూడా కొత్త ఉద్యోగాల కల్పన 5 శాతానికి మంచి ఉండదంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: June 10, 2020, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading