CBSE Syllabus 2020-21 : 11, 12 తరగతులకు మాథ్స్ సబ్జెక్ట్ బుక్ విడుదల... ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.

Corona Lockdown | Corona Update : కరోనా కాలంలో... బుక్స్ ఆన్‌లైన్‌లో వచ్చేస్తున్నాయి. మరి మాథ్స్ హ్యాండ్ బుక్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

news18-telugu
Updated: May 11, 2020, 11:55 AM IST
CBSE Syllabus 2020-21 : 11, 12 తరగతులకు మాథ్స్ సబ్జెక్ట్ బుక్ విడుదల... ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.
CBSE 2020-21 : 11, 12 తరగతులకు మాథ్స్ సబ్జెక్ట్ బుక్ విడుదల... ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.
  • Share this:
Corona Lockdown | Corona Update : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేష్ (CBSE).... 11, 12 తరగతులకు అప్లైడ్ మేథ్స్ సబ్జెక్టులో హ్యాండ్‌బుక్ రిలీజ్ చేసింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి బోర్డు... కామర్స్, హ్యుమానిటీస్ విద్యార్థులకు కొత్త అకడమిక్ సెషన్ ప్రారంభిస్తోంది. ఈ సబ్జెక్ట్ కొత్తది కాబట్టి... బోర్డు... దీనికి సంబంధించిన సిలబస్ రిలీజ్ చెయ్యడమే కాదు... 11, 12 తరగతులకు అప్లైట్ మేథమేటిక్స్‌‌లో ఓ కంప్లీట్ హ్యాండ్‌బుక్‌ని కూడా విడుదల చేసింది. డౌన్‌లోడ్ చేసుకోతగ్గ ఆ హ్యాండ్ బుక్.... విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది. కింది లింక్ ద్వారా... దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

12వ తరగతి విద్యార్థుల కోసం లింక్ - CBSE Class 12 Applied Mathematics Handbook

11వ తరగతి విద్యార్థుల కోసం లింక్ - CBSE Class 11 Applied Mathematics Handbook

ఈ హ్యాండ్‌బుక్స్‌లో కొత్త కోర్సుల సిలబస్‌తోపాటూ... ఎక్సర్‌సైజ్‌లు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం నుంచి కొత్త పేపర్ తెస్తున్నారు కాబట్టి... ఈ బుక్స్ ఇంకా మార్కెట్లలో లభించట్లేదు. ఈ హ్యాండ్‌బుక్స్ ద్వారా... విద్యార్థులు చదువుకునేందుకు, స్కూళ్లలో కోర్స్ ప్రారంభించేందుకు వీలవుతుంది.

CBSE 2020-21కి మారిన సిలబస్ వివరాలు :
సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులకు సంబంధించి CBSE ఇంకా సంబంధిత సమాచారం ఇవ్వలేదు. బోర్డు, HRD మంత్రిత్వ శాఖ ప్రస్తుత సిలబస్‌ను తగ్గిస్తామని చెప్పాయి. కొత్త విద్యా సంవత్సరానికి క్లాసులు... ఆన్‌లైన్‌లో మొదలయ్యేలా ఉన్నాయి కాబట్టి... అందుకు తగ్గట్టుగా... సిలబస్‌ను తగ్గించాలనుకుంటోంది బోర్డ్.

CBSE, NCERT వివిధ స్కూళ్ల హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపల్స్, టీచర్లతో సంప్రదింపుల తర్వాత 10, 12 తరగతులకు సిలబస్ తగ్గించాలని నిర్ణయించాయి. స్కూళ్లలో కూడా 1 నుంచి 8 వరకు... సిలబస్ తగ్గించబోతున్నారు. CBSE బోర్డు ప్రస్తుతం ఉన్న సిలబస్‌నే కంటిన్యూ చెయ్యమని కోరింది. కొన్ని పార్టులు లేదా టాపిక్స్ మాత్రమే తొలగిస్తామని తెలిపింది. పూర్తిగా చాప్టర్లు తొలగించేది ఉండదని వివరించింది.
Published by: Krishna Kumar N
First published: May 11, 2020, 11:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading