Corona Lockdown | Corona Update : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులకు ఇది మేలు చేయబోతోంది. పెండింగ్‌లలో ఉన్న CBSE బోర్డుకి సంబంధించిన టెన్త్, ఇంటర్ సెకండ్ ఇయర్... ఎగ్జామ్స్ ఇక నిర్వహించే అవకాశం లేదని కేంద్రం తెలిపింది. ఈ ఎగ్జామ్స్ రాయని విద్యార్థులకు... అంతకు ముందు ఏడాది కాలంలో రాసిన పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టీ... నెక్ట్స్ తరగతులకు వెళ్లేదీ, లేనిదీ నిర్ణయిస్తారని కేంద్రం చెప్పింది. ఐతే... ఎగ్జామ్స్ రద్దు నిర్ణయంపై ఫైనల్ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. ఆయా రాష్ట్రాల్లో బోర్డులు దీనిపై ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నాయి.
ఐతే... ఈ అంశంపై రకరకాల వదంతులు వస్తున్నాయన్న CBSE... టెన్త్, క్లాస్ 12లో 29 సబ్జెక్టులకి సంబంధించి... ఇదివరకు తీసుకున్న నిర్ణయమే కొనసాగుతుందని బోర్డు సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 1న తమ సర్క్యులర్‌లో ఏం చెప్పారో అదే ఇప్పటికీ కొనసాగుతుందని తెలిపారు.
సీబీఎస్ఈ తాజా ప్రకటన
CBSE... టెన్త్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌ని మార్చిలో వాయిదా వేసింది. అప్పటికే దేశంలో కరోనా వ్యాపించడంతో ఆ నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో... కేంద్ర HRD మంత్రి రమేష్ పోఖ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే ఏడాది JEE, NEET... ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్‌ను 30 శాతం తగ్గించనున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాలూ... ఆల్రెడీ జరిగిన పరీక్షల ఆన్సర్ షీట్లకు వాల్యుయేషన్ ప్రారంభించాలని కోరారు. ప్రతీ సంవత్సరం లాగే... షెడ్యూల్ టైమ్‌కే రిజల్ట్స్ ప్రకటించేందుకు ప్రయత్నించాలని కోరారు.
కేంద్రం నిర్ణయాన్ని ఎలా అమలుచెయ్యాలనేది రాష్ట్రాలు నిర్ణయం తీసుకోనున్నాయి. కేంద్రం అంచనా ప్రకారం... దేశవ్యాప్తంగా 80 శాతం ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. కేరళలో మాత్రం అవి అస్సలు పూర్తి కాలేదు. ఎందుకంటే... దేశంలో ముందుగా కరోనా కేరళలోనే వచ్చింది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.