ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... టెన్త్ విద్యార్థులకు వాట్సాప్ లెసన్స్...

Corona Lockdown | Corona Update : కరోనా వదలట్లేదు. అలాగని ప్రతీదీ వాయిదా వేసుకోవడం కరెక్టు కాదు అనుకున్న ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: May 12, 2020, 9:18 AM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... టెన్త్ విద్యార్థులకు వాట్సాప్ లెసన్స్...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... టెన్త్ విద్యార్థులకు వాట్సాప్ లెసన్స్... (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ విద్యార్థులు... స్మార్ట్ మొబైళ్లు పట్టుకునే టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం టెన్త్ విద్యార్థులు చదివే సిలబస్‌ను వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విద్యార్థులకు పంపాలని ప్లాన్స్ వేస్తోంది. ప్రతీ స్కూలుకూ ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటోంది. ఈ గ్రూపులో ఆ స్కూల్లోని విద్యార్థులు, టీచర్లు ఉంటారు. ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలను టీవీ లేదా రేడియోలో లెసన్స్ రూపంలో చెబుతూ... అందుకు సంబంధించిన డేటాను వాట్సాప్‌ గ్రూపులో పంపనున్నట్లు తెలిసింది.

ఉదాహరణకు టీవీ కోచింగ్‌లో ఓ ప్రశ్న అడిగితే... ఆ ప్రశ్న... వాట్సాప్ గ్రూపులో విద్యార్థికి చేరుతుంది. విద్యార్థులు దానికి సమాధానం రాసి... దాన్ని ఫొటో తీసి... గ్రూపులో పంపాల్సి ఉంటుంది. ఆ ఫొటో డేటాను టీచర్లు పరిశీలించి... ఫీడ్‌బ్యాక్‌ను గ్రూపులో ఇస్తారు. ఇలా విద్యార్థులు వాట్సాప్ గ్రూపును వాడుకొని టెన్త్ క్లాస్ చదువుకోవాలన్నమాట.

లాక్‌డౌన్ మే 17తో ముగుస్తుంది కదా. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విద్యార్థులకు క్లాసులు ప్రారంభిస్తుంది. మొత్తం 24వేల మంది విద్యార్థులు, 933 మంది టీచర్లు... ఈ ఆన్‌లైన్ క్లాసుల్లో చేరతారు. లెక్చరర్లు తమ క్లాసులను వీడియో రికార్డ్ చేసి... యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ యూట్యూబ్ URL లింకును వాట్సాప్ గ్రూపు లేదా ఈ-మెయిల్‌లో విద్యార్థులకు పంపుతారు. విద్యార్థులు ఆ లింక్ ఓపెన్ చేసి... వీడియో చూసి... లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే... వారు తయారుచేసుకునే నోట్స్‌ను వాట్సాప్ లేదా ఈమెయిల్‌లో టీచర్లకు పంపాల్సి ఉంటుంది.

విద్యార్థులు ప్రభుత్వం అభివృద్ధి చేసిన అభ్యాస (Abhyasa) పోర్టల్‌లోకి వెళ్లి... అక్కడి వీడియోలను చూసి... ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూనియర్ క్లాసులకు కూడా ప్రభుత్వం జూన్, జులైలో ఇదే విధానాన్ని ప్రారంభించబోతోంది. కాలేజీ విద్యార్థులకు 5979 క్లాసులు జరిగాయి. పెండింగ్ ఉన్న సిలబస్ పూర్తి చెయ్యడానికి టీచర్లు ప్రయత్నిస్తున్నారు.

ఏపీ SSC 2020 పరీక్షలు... జులైలో జరగనున్నాయని, జూన్‌లో జరగబోవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు ఛాన్స్ ఇవ్వాలనే జులైలో నిర్వహిస్తామని తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: May 12, 2020, 8:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading