శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్ నర్సులు, ఫిజియో థెరపీస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన తీసుకోనున్నారు. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో పొందు పరిచారు. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు పోస్టుల వారీగా రూ. 500, రూ.300 పరీక్ష ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫాంలో పంపడానికి చివరి తేదీ. సెప్టెంబర్ 23, 2021 వరకు అవకాశం ఉంది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు సమాచారం కోసం ముందుగా అధికారిక వెబ్సైట్ https://srikakulam.ap.gov.in/ ను సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాల్లో కలిపి 12 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు |
ల్యాబ్ టెక్నీషియన్ జీఆర్-1 | పదో తరగతి పాసై ఉండాలి. ఎమ్ఎల్టీ (MLT)లో డిప్లమా చేసి ఉండాలి. అంతే కాకుండా అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్(Para Medical) బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి | 04 |
ఫిజియోథెరిపిస్ట్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీ(University)లో ఫిజియోథెరపీలో డిగ్రీ చేసి ఉండాలి. | 01 |
స్ఠాఫ్ నర్సులు | బీఎస్సీ నర్సింగ్(Nursing) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో జనరల్ నర్సింగ్ కోర్సు చేసి ఉండాలి | 07 |
MG University: నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఉద్యోగాలు
ఎంపిక విధానం.. దరఖాస్తు చేసుకొనే విధానం
- అభ్యర్థులు కేవలం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తు చేసుకొనే వారు ముందుగా అధికారిక వెబ్సైట్ను https://srikakulam.ap.gov.in/ సందర్శించాలి.
- అనంతరం నోటిఫికేషన్ను పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- అనంతరం నోటిఫికేషన్(Notification) చివరిలో ఉన్న అప్లికేషన్ ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఫాంను పూర్తిగా నింపాలి.
- ఫాంను సబ్మిట్ చేసేటప్పుడు దరఖాస్తు(application) రుసుంను డీడీ(DD) రూపంలో చెల్లించాలి.
- డీడీ in Favor of Hospital development Society, Government General Hospital, Srikakulam పేరు మీద చెల్లించాలి.
- స్టాఫ్ నర్సుకు రూ.500 ఫీజు, ల్యాబ్ టెక్నిషియన్(Technician) పోస్టులకు రూ.300 డీడీ సబ్మిట్(Submit) చేయాలి.
- ఎంపిక విధానం జీ.ఓ.ఎమ్ఎస్.నం.163, హెచ్&ఎఫ్డబ్ల్యూ (బీ1) Dept.,dt:12.09.2018 ఆధారంగా నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS