Home /News /jobs /

CONTRACT JOBS IN DMHO WEST GODAVARI ELURU KNOW ELIGIBILITY TODAY LAST DETAILS EVK

Andhra Pradesh Jobs 2021 : ప‌శ్చిమ గోదావరి జిల్లా డీఎంహెచ్‌లో 105 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రేపే ఆఖ‌రు తేదీ

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఉద్యోగాలు

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఉద్యోగాలు

ప‌శ్చిమ గోదావరి జిల్లా (ఏలూరు) వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organisation)లో 105 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ పోస్టుల‌ను కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 3, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    ప‌శ్చిమ గోదావరి జిల్లా (ఏలూరు)  వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organisation)లో 105 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్టాఫ్ న‌ర్సులు (Staff Nurse), డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లు, ల్యాబ్ టెక్నిషియ‌న్లు (Lab Technicians), లాస్ట్ గ్రేడ్ స‌ర్వీస్ పోస్టుల‌ను కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిక‌న నియ‌మించ‌నున్నారు. ఈ పోస్టుల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక‌ వెబ్‌సైట్   https://westgodavari.ap.gov.in/notice_category/recruitment-en/  ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు కొద్ది రోజుల మాత్ర‌మే అవ‌కాశం ఉంది. అక్టోబ‌ర్ 3, 2021  సాయంత్రం 5 గంట‌ల లోపు ఈ ద‌ర‌ఖాస్తును అందించాల్సి ఉంటుంది. కేవ‌లం ఆఫ్‌లైన్‌ (Offline) ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ నిర్వ‌హిస్తున్నారు. పోస్టులకు సంబంధించిన స‌మాచారం కోసం చ‌ద‌వండి.




























    పోస్టు పేరుఅర్హ‌త‌లుఖాళీలు
    స్టాఫ్ న‌ర్సులుగుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో ఇంట‌ర్ మ‌రియు జీఎన్ఎం/ బీఎస్సీ న‌ర్సింగ్ చేసి ఉండాలి.59
    డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లుఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. మూడు నెల‌లు కంప్యూట‌ర్ కోర్సు చేసిన స‌ర్టిఫికెట్ ఉండాలి.17
    ల్యాబ్ టెక్నిషియ‌న్లుగుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో ఇంట‌ర్ అండ్ డీఎల్‌టీ/ బీఎస్సీ, ఎంఎల్‌టీ కోర్సు చేసి ఉండాలి. ఇంట‌ర్ (Inter) వొకేష‌న‌ల్ ఎంఎల్‌టీతో ఒక సంవ‌త్స‌రం అప్రెంటీస్‌షిప్ చేసి ఉండాలి.21
    లాస్ట్ గ్రేడ్ స‌ర్వీస్ పోస్టుప‌దోత‌ర‌గ‌తి లేదా అంత‌కు స‌మాన‌మైన కోర్సు చ‌దివి ఉండాలి53

    Telangana Jobs 2021 : రంగారెడ్డి జిల్లాలో మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌


    ఎంపిక విధానం..
    Step 1:  మెరిట్ (Merit) ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.
    Step 2:  రిజ‌ర్వేష‌న్ విధానం పాటిస్తారు.



    మార్కుల‌ విధానం..
    - అర్హ‌త ప‌రీక్ష మెరిట్ ద్వారా 75 మార్కులు
    - అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం నుంచి కాలాన్ని లెక్కించి 10 మార్కులు వెయిటేజ్ ఉంటుంది.
    - 15 మార్కులు అభ్య‌ర్థి ప‌ని అనుభ‌వం (Experience) ఆధారంగా ఇస్తారు.

    ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

    Step 1:  అభ్య‌ర్థి కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 2:  ముందుగా అధికారిక జిల్లా వెబ్‌సైట్  https://westgodavari.ap.gov.in/notice_category/recruitment-en/ ను సంద‌ర్శించాలి.

    Step 3:  ద‌ర‌ఖాస్తు ఫాం కోసం అనంత‌రం నోటిఫికేష‌న్ డౌలోడ్ చేసుకోవాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 4:  అనంత‌రం ఫాం త‌ప్పులు లేకుండా నింపాలి.

    Step 5:  అప్లె చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మై స‌ర్టిఫికెట్లు
    - ప‌దోత‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్‌
    - 4 నుంచి 10 వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికెట్లు
    - పోస్టుకు అవ‌స‌ర‌మైన అర్హ‌త ధ్రువ‌ప‌త్రాలు

    Step 6:  ద‌ర‌ఖాస్తు ఫాంతోపాటు స‌ర్టిఫికెట్లను ఉంచి
    డీఎంహెచ్ఓ, ఏలూరు, ప‌శ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ చిరునామాకు పంపాలి.

    Step 7:  ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 3, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2021, Health department, Health department jobs, Job notification, West Godavari

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు