హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs : క‌ర్నూలు జిల్లా వైద్యా విభాగంలో 159 కాంట్రాక్టు ఉద్యోగాలు

Andhra Pradesh Jobs : క‌ర్నూలు జిల్లా వైద్యా విభాగంలో 159 కాంట్రాక్టు ఉద్యోగాలు

క‌ర్నూలు జిల్లా ఉద్యోగాలు

క‌ర్నూలు జిల్లా ఉద్యోగాలు

క‌ర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organisation)లో 159 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ పోస్టుల‌ను కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి సెప్టెంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

  క‌ర్నూలు జిల్లా  వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organization)లో 159 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్టాఫ్ న‌ర్సులు (Staff Nurse), డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లు, ల్యాబ్ టెక్నిషియ‌న్లు (Lab Technicians), లాస్ట్ గ్రేడ్ స‌ర్వీస్ పోస్టుల‌ను కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిక‌న నియ‌మించ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ను కొనే వారి వ‌య‌సు 18 నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.  ఈ పోస్టుల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక‌ వెబ్‌సైట్  https://kurnool.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు కొద్ది రోజుల మాత్ర‌మే అవ‌కాశం ఉంది. సెప్టెంబ‌ర్ 30, 2021 సాయంత్రం 5 గంట‌ల లోపు ఈ ద‌ర‌ఖాస్తును అందించాల్సి ఉంటుంది. కేవ‌లం ఆఫ్‌లైన్‌ (Offline) ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ నిర్వ‌హిస్తున్నారు. పోస్టులకు సంబంధించిన స‌మాచారం కోసం చ‌ద‌వండి.

  పోస్టు పేరుఅర్హ‌త‌లుఖాళీలుజీతం
  స్టాఫ్ న‌ర్సులుగుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో ఇంట‌ర్ మ‌రియు జీఎన్ఎం/ బీఎస్సీ న‌ర్సింగ్ చేసి ఉండాలి.76రూ.34,318/-
  డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లుఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. మూడు నెల‌లు కంప్యూట‌ర్ కోర్సు చేసిన స‌ర్టిఫికెట్ ఉండాలి.30రూ.15,000/-
  ల్యాబ్ టెక్నిషియ‌న్లుగుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో ఇంట‌ర్ అండ్ డీఎల్‌టీ/ బీఎస్సీ, ఎంఎల్‌టీ కోర్సు చేసి ఉండాలి. ఇంట‌ర్ (Inter) వొకేష‌న‌ల్ ఎంఎల్‌టీతో ఒక సంవ‌త్స‌రం అప్రెంటీస్‌షిప్ చేసి ఉండాలి.22రూ.28,000/-
  లాస్ట్ గ్రేడ్ స‌ర్వీస్ పోస్టుప‌దోత‌ర‌గ‌తి లేదా అంత‌కు స‌మాన‌మైన కోర్సు చ‌దివి ఉండాలి31రూ.12,000/-


  SSC Recruitment 2021: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 3,261 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల

  ఎంపిక విధానం..

  - మెరిట్ (Merit) ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

  - రిజ‌ర్వేష‌న్ విధానం పాటిస్తారు.

  మార్కుల‌ విధానం..

  - అర్హ‌త ప‌రీక్ష మెరిట్ ద్వారా 75 మార్కులు

  - అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం నుంచి కాలాన్ని లెక్కించి 10 మార్కులు వెయిటేజ్ ఉంటుంది.

  - 15 మార్కులు అభ్య‌ర్థి ప‌ని అనుభ‌వం (Experience) ఆధారంగా ఇస్తారు.

  ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

  Step 1:  అభ్య‌ర్థి కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

  Step 2:  ముందుగా అధికారిక జిల్లా వెబ్‌సైట్  https://kurnool.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.

  Step 3:  ద‌ర‌ఖాస్తు ఫాం కోసం అనంత‌రం నోటిఫికేష‌న్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

  Step 4:  అనంత‌రం ఫాం త‌ప్పులు లేకుండా నింపాలి.

  Step 5:  అప్లె చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మై స‌ర్టిఫికెట్లు

  - ప‌దోత‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్‌

  - 4 నుంచి 10 వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికెట్లు

  - పోస్టుకు అవ‌స‌ర‌మైన అర్హ‌త ధ్రువ‌ప‌త్రాలు

  Step 6:  ద‌ర‌ఖాస్తు ఫాంతోపాటు స‌ర్టిఫికెట్లను ఉంచి

  డీఎంహెచ్ఓ,  క‌ర్నూలు జిల్లా  ఆంధ్ర‌ప్ర‌దేశ్ చిరునామాకు పంపాలి.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Andhra Pradesh, CAREER, Govt Jobs 2021, Health department jobs, Job notification, Kurnool

  ఉత్తమ కథలు