హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉద్యోగాలు.. ఖాళీలు, జీతం వివరాలివే..!

TS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉద్యోగాలు.. ఖాళీలు, జీతం వివరాలివే..!

భూపాపలపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉద్యోగాలు

భూపాపలపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉద్యోగాలు

భూపాలపల్లి జిల్లా (Bhupalapalli District) పాస్ట్ ట్రాక్ కోర్టులో ఉద్యోగాలకు (Jobs) ప్రకటన వెలువడింది. ఉద్యోగాల నియమాకానికై కోర్టు అధికారులు భర్తీ చేయనున్న ఖాళీల వివరాలను వెల్లడించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Bhupalpalle, India

  Venu, News18, Mulugu

  ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎప్పుడూ ఎదురుచూస్తుంటుంది. రాష్ట్రస్థాయి ఉద్యోగాల ప్రకటనతో పాటు అప్పుడప్పుడు జిల్లాస్థాయిలోనూ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అవుతుంటాయి. తాజాగా తెలంగాణ (Telagana) భూపాలపల్లి జిల్లా (Bhupalapalli District) పాస్ట్ ట్రాక్ కోర్టులో ఉద్యోగాలకు (Jobs) ప్రకటన వెలువడింది. ఉద్యోగాల నియమాకానికై కోర్టు అధికారులు భర్తీ చేయనున్న ఖాళీల వివరాలను వెల్లడించారు. ఇందులో మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు విధివిధానాలకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చు.

  కాంట్రాక్టు పద్ధతిలో ఖాళీల వివరాలు:

  సీనియర్ సూపర్వైజర్ -01ఖాళీ

  వేతనం 40,000

  అర్హత : కోర్టులో రిటైర్డ్ ఉద్యోగి మాత్రమే

  స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III -01 ఖాళీ

  వేతనం : 19500

  అర్హత : ఏదైనా డిగ్రీ మరియు హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ ఇన్ షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్

  సీనియర్ అసిస్టెంట్ - 01 ఖాళీ

  వేతనం : 22,750

  అర్హత : ఏదైనా డిగ్రీ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి

  జూనియర్ అసిస్టెంట్ - 02 ఖాళీలు

  వేతనం : 19500

  అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉండాలి తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

  టైపిస్ట్ -02 ఖాళీలు

  వేతనం : 19500

  అర్హత : ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇంగ్లీష్ హయ్యర్ టైప్ రైటింగ్ సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి

  డ్రైవర్ -01 ఖాళీ

  వేతనం : 19500

  అర్హత : 10వ తరగతి పాస్ అయి ఉండాలి, ఎల్ఎంవి లైసెన్స్ కలిగి ఉండాలి,

  డ్రైవింగ్ లో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి, తెలుగు ఇంగ్లీష్ రాయడం వచ్చి ఉండాలి

  అటెండర్ - 04 ఖాళీలు

  వేతనం : 15,600

  అర్హత : ఏడు నుంచి పదవ తరగతి చదివిన అభ్యర్థులు.

  ఇది చదవండి: ప్రకృతి వ్యవసాయంతో రెండు చేతులా సంపాదిస్తున్న రైతు.. ఆ సీక్రెట్ ఏంటో మీరే చూడండి..

  పై ఉద్యోగాల కోసం తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు కేవలం స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా గానీ దరఖాస్తులను పంపించాలి. వ్యక్తిగతంగా ఆఫీసులో ఇవ్వటానికి అనుమతించబడదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను 'ప్రిన్సిపాల్ సెషన్స్ కోర్టు జడ్జి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా'కు పంపాలి. దరఖాస్తులు పంపవలసిన చివరి తేదీ 1 అక్టోబర్ 2022. సాయంత్రం 5 గంటలలోపు అందేలా దరఖాస్తులను పంపాలి.

  అభ్యర్థులు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా యందు ఒక్క సంవత్సరపు కాల వ్యవధితో నియమితులవుతారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులో కమ్యూనిటీ సర్టిఫికెట్, ఎంప్లాయిమెంట్ కార్డు, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం లోకల్ క్యాడర్, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, విద్యార్హత సర్టిఫికెట్లను జత చేయవలసి ఉంటుంది. ప్రతి పోస్ట్‌కి అర్హత కలిగిన వారిని ఇంటర్వ్యూ మరియు కంప్యూటర్ టెస్ట్ ద్వారా మాత్రమే ఎంపిక చేయబడతారు. కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఆరూరి శ్యామలత వివరించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Telangana, Telangana government jobs

  ఉత్తమ కథలు