కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ (Kudremukh Iron Ore Company Limited) సిస్టమ్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో కాంట్రాక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 11, 2021 నుంచి ఆన్లైన్(Online)లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు..
- గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ స్ట్రుమెంటేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. కచ్చితం 60శాతం మార్కులు గాని 6.0 సీజీపీఏ ఉండాలి. దూరవిద్య(Distance Education) ద్వారా ఇంజినీరింగ్ చేసిన విద్యార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవద్దు.
- వయసు 28 సంవత్సరాల లోపు ఉండాలి.
- వృత్తి పరమైన అనుభవం(Experience) ఒక సంవత్సరం ఉండాలి.
GATE 2022: గేట్ 2022లో రెండు పేపర్లు రాస్తున్నారా.. ప్రియారిటీ సబ్జెక్ట్ ఎంచుకోండి ఇలా
దరఖాస్తు చేసుకొనే విధానం..
- దరఖాస్తు కేవలం ఆన్లైన్ ద్వారానే చేయాలి
- ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి (వెబ్సైట్ కోసం క్లిక్ చేయండి)
- కెరీర్ పోర్టల్‌లోకి వెళ్లి ఆన్లైన్ అప్లికేషన్(Application)ను తెరవాలి
- మీ విద్యార్హతలు.. అనుభవం పూర్తి వివరాలను నమోదు చేయాలి.
- అనంతరం మీకు సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నంబర్ వస్తుంది.
- ఆన్లైన్ దరఖాస్తుకు సెప్టెంబర్ 11, 2021 నుంచి 27 సెప్టెంబర్, 2021 వరకు అవకాశం ఉంది.
- అనంతరం ఆన్లైన్ దరఖాస్తు ఫారం యొక్క హార్డ్ కాపీ(Hard Copy)ని కేఐఓసీఎల్కు పోస్ట ద్వారా అక్టోబర్ 01, 2021లోపు పంపాలి. అడ్రస్ నోటిఫికేషన్(Notification)లో ఉంటుంది. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం - సెప్టెంబర్ 11, 2021
ఆన్లైన్ దరఖాస్తులు సబ్మిట్ చేసేందుకు చివరి తేది - సెప్టెంబర్ 27, 2021
హార్డ్ కాపీని పంపడానికి చివరి తేదీ - అక్టోబర్ 1, 2021
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021