జెడ్డాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా హజ్ సీజన్ 2023 కోసం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, క్లార్క్స్, మేసేంజర్ల వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని తాత్కాళిక నియామకంపై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులకు జీతాలు ఇలా ఉంటాయి.
డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నెలకు రూ.79వేలకు పైగా ఉంటుంది. అంటే సౌదీ కరెన్సీలో 3600 రియల్స్. డ్రైవర్ గా నియామకం అయిన అభ్యర్థులకు నెలకు 63వేలకు పైగా ఉంటుంది. సౌదీ కరెన్సీలో 2880 సౌదీ రియల్స్ గా ఉంటుంది. మేసేంజర్లకు నెలకు 1980 సౌదీ రియల్స్. అంటే మన కరెన్సీలో నెలకు రూ. రూ. 43,792 ఉంటుంది.
దరఖాస్తుల చేసుకునే అభ్యర్థులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. దీంతో పాటు ఏదైనా భారతీయ భాషతో పాుట.. అరబిక్ భాషలో పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వాళ్లు క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా/సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ప్రాధాన్యత ఉంటుంది. మిగిలిన పోస్టులకు కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్పిన లింక్ ను ఉపయోగించి దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
దరఖాస్తు విధానం ఇలా..
-మొదట అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-తర్వాత ఓపెన్ అయిన వెబ్ సైట్ లో దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
-దరఖాస్తు ఫారమ్ లో వ్యక్తిగత సమాచారంతో పాటు.. విద్యార్హత వివరానలు నమోదు చేయాలి.
-చివరగా దరఖాస్తు ఫారమ్ తో పాటు.. పాస్‌పోర్ట్ ఫొటో కాపీలు ఇఖామా స్పాన్సర్ నుంచి నో అబ్జెక్చన్ లేటర్(ఒరిజినల్) రెండు రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను అప్లికేషన్‌తో జతచేయాలి.
-వీటిని హజ్ సెక్షన్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, PO Box. No. 952, జెడ్డా-21421 అడ్రస్ కు పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Private Jobs, Saudi Arabia