హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSLPRB Constable Exam Questions: ప్రశాంతంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష.. ప్రశ్నల సరళి ఇలా..

TSLPRB Constable Exam Questions: ప్రశాంతంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష.. ప్రశ్నల సరళి ఇలా..

TSLPRB Constable Exam Questions: ప్రశాంతంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష.. ప్రశ్నల సరళి ఇలా..

TSLPRB Constable Exam Questions: ప్రశాంతంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష.. ప్రశ్నల సరళి ఇలా..

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షను విజయవంతగా పూర్తిచేశారు అధికారులు. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన ఈ పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష(Constable Preliminary Exam) ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షను విజయవంతగా పూర్తిచేశారు అధికారులు. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన ఈ పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 16వందల సెంటర్లలో ఎగ్జామ్(Exam) నిర్వహించారు. 15,644 పోస్టులకు గాను 9.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేశారు పోలీసులు. ఎగ్జామ్ సెంటర్(Exam Center) పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు(Xerox Centers), స్టేషనరీలను మూసివేయించారు. ఖమ్మం జిల్లాలో 105 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించారు. ఖమ్మం నగరం. పరిసరాల పరిధిలోని 89 పరిక్ష కేంద్రాలలో 30 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. సత్తుపల్లిలోని 16 పరీక్ష కేంద్రాలలో 8 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.


Tenth-Degree Jobs: పది, డిగ్రీ పాస్ అయ్యారా.. అయితే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో ఈ పోస్టులు మీ కోసమే..


ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మొత్తం 105 పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు పరిక్ష కేంద్రాల సమీపంలో 500 అడుగుల లోపు ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు అనుమది ఇవ్వలేదు. కామారెడ్డి జిల్లాలో 29 కేంద్రాలలో 11 వేల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఒక్క నిమిషం నిబంధన అనేది ప్రతీ సెంటర్లో అమలు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 173 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.ఈ కేంద్రాల్లో మొత్తం 70వేల మందికి పైగా హాజరయ్యారు. గంట ముందు నుంచే పరీక్ష సెంటర్ లోకి అనుమతినిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8.45 గంటలకే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతినిచ్చారు. కరీంనగర్ లో కానిస్టేబుల్ రాత పరీక్ష కోసం 55 సెంటర్లు ఏర్పాటు చేశారు.జగిత్యాల జిల్లాలో 8వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఇందుకు గాను జిల్లాలో 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కానిస్టేబుల్ పరీక్ష కేంద్రలు మొత్తం 127 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు.


Telangana Government Key Announcement: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ 9 వేల మంది సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులే..!


ప్రశ్నల సరళి ఇలా..  • పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రశ్నల సరళి గురించి తెలిపారు. పరీక్ష ఎస్సై ప్రిలిమ్స్ కంటే సింపుల్ గా వచ్చినట్లు పేర్కొన్నారు. జనరల్ స్టడీస్ విభాగంలో ప్రశ్నలను ఈజీగానే వచ్చినట్లు తెలిపారు.

  • మ్యాథ్స్, రీజనింగ్ విభాగంలో ప్రశ్నలను తేలికగా ఇచ్చినా.. సమయం ఎక్కువగా తీసుకుందని అన్నారు.

  • మైనస్ మార్కులు ఉండటంతో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా సమాధానాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. 60 మార్కులు సాధించిన ప్రతీ అభ్యర్థి దీనిలో అర్హత సాధిస్తారు. తర్వాత ఫిజికల్ టెస్టులకు అభ్యర్థులు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది.

  • మొత్తానికి కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నల స్థాయి ఈజీగానే అడిగినట్లు అభ్యర్థులు తెలిపారు. ఎస్సై పరీక్షలో కంటే.. కానిస్టేబుల్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించే అవకాశం ఉంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Telangana government jobs, Telangana jobs, Tslprb

ఉత్తమ కథలు