మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలి -కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్

ఇంటర్ బోర్డు వివాదాలపై కాంగ్రెస్ స్పందించింది. ఇంటర్ పరీక్షల్లో జరిగిన తప్పిదాలపై న్యాయవిచారణ చేయాలని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ పట్టుబట్టారు. లోపాలపై బాధ్యత వహిస్తూ మంత్రివర్గం నుంచి జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: April 24, 2019, 7:03 AM IST
మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలి -కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 24, 2019, 7:03 AM IST
మంత్రి జగదీష్ రెడ్డిని మున్నాబాయి ఎంబీబీఎస్ అంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. ఇంటర్ బోర్డు తప్పిదాలపై స్పందించిన ఆయన.. మంత్రి జగదీష్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డు వైఫల్యం చెందిందని.. ఇందుకు బాధ్యులపై బోర్డు, గ్లోబ్ ఎరినా టెక్నాలజీస్ పై హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు నిర్వాకంతో వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దారుణంగా నష్టపోయారన్న శ్రవణ్.. ఈ విషయంలో మంత్రి జగదీష్ రెడ్డి అసమర్ధత స్పష్టంగా బయటపడిందని తెలిపారు. దీనిపై స్పందిస్తూ కేసీఆర్ జగదీష్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఇంటర్ బోర్డు చేసిన తప్పుల వల్ల 25 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారని, వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థుల సహాయం కోసం అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని కోరారు.

తప్పులన్నీ బోర్డు చేసి .. ఇప్పుడు రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు డబ్బులు కట్టడంటూ ఉచిత సలహా ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి అనుభవం ఉన్న ప్రైవేట్ ఏజెన్సీలు చేసేవని.. ఇప్పుడు ఆ విభాగాల పనులన్నింటినీ ఇంటర్ బోర్డు విలీనం చేయడం వల్లే సమస్య మొదలైందని శ్రవణ్ అభిప్రాయపడ్డారు. సాంకేతిక అర్హత ఏమాత్రం లేని హైదరాబాద్కు చెందిన గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కు పనులు అప్పగించడం వల్లే ఇన్ని తప్పిదాలు జరిగాయన్నారు. బోర్డు జారీ చేసిన టెండర్ నిబంధనల ప్రకారం కంపెనీ లేదని.. జారీ చేసిన 11 అర్హతల్లో ఏడు అంశాలు కంపెనీకి లేవని శ్రవణ్ ఆరోపించారు. ఇంతకు ముందు ఏ ఇంటర్ బోర్డులోనూ పనిచేయని, ఎలాంటి అర్హతలేని కంపెనీకి బాధ్యతలు అప్పగించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ఇంటర్ బోర్డు ఆటలాడిందని శ్రవణ్ మండిపడ్డారు. కేవలం 20వేల మంది విద్యార్థుల రీవాల్యయేషన్ కారణంగా ఇంత భారీ కాంట్రాక్టుని గ్లోబరీనా టెక్నాలజీ పొందిందని.. దీనివెనుక భారీ కుంభకోణమే దాగిఉందని శ్రవణ్ ఆరోపించారు.

ప్రశ్నాపత్రాల లీక్, ఆన్సర్ షీట్ మిస్సింగ్, రోజుకి 30 పత్రాల బదులు 60 పత్రాలు దిద్దడం.. హాజరైన విద్యార్థులకి గైర్హాజరుగా, 90శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు ఫెయిల్ అయినట్టు చూపడం, మ్యాథ్స్ స్టూడెంట్కి ఎకనామిక్స్ మార్కుల సీట్ ఇలా ఇన్ని తప్పులు జరిగినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాల్యూయేషన్ చేయించుకోవాలని చెప్పడం ఎంత దారుణం.. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...