హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Singareni JA Results: తప్పులతడకగా సింగరేణి ఫలితాలు.. తప్పుడు పేర్లపై అధికారుల సమాధానం ఇదే..

Singareni JA Results: తప్పులతడకగా సింగరేణి ఫలితాలు.. తప్పుడు పేర్లపై అధికారుల సమాధానం ఇదే..

Singareni JA Results: తప్పులతడకగా సింగరేణి ఫలితాలు.. తప్పుడు పేర్లపై అధికారుల సమాధానం ఇదే..

Singareni JA Results: తప్పులతడకగా సింగరేణి ఫలితాలు.. తప్పుడు పేర్లపై అధికారుల సమాధానం ఇదే..

Singareni JA Results: సింగరేణిలో ఏ పరీక్ష నిర్వహించినా ప్రతీ సారి ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. 2015 సంవత్సరంలో నిర్వహించిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ సమయంలో కూడా ఒకే కుటుంబంలో ముగ్గురు, నలుగురికి ఉద్యోగాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సింగరేణిలో ఏ పరీక్ష(Singareni Exam) నిర్వహించినా ప్రతీ సారి ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. 2015 సంవత్సరంలో నిర్వహించిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్(Singareni Junior Assistant) పోస్టుల భర్తీ సమయంలో కూడా ఒకే కుటుంబంలో ముగ్గురు, నలుగురికి ఉద్యోగాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. కానీ వాటిపై నిజనిజాలు మాత్రం నిర్ధారణ కాలేదు. ఇక.. తాజాగా సింగరేణి జూనియర్ అసిస్టెంట్ 177 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి.. సెప్టెంబర్ 4, 2022న పరీక్ష ను నిర్వహించారు. పరీక్ష జరిగిన రోజే పరీక్షా పేపర్ ను లీక్ చేసి గోవాలో పరీక్ష రాయించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అధికారులు ఎలాంటి అవకతవకలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. తర్వాత ప్రాథమిక కీని వెల్లడించారు. దీనిలో దాదాపు 3 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది.

Government Job Notifications: ఇంటర్, డిగ్రీ/బీటెక్ అర్హతతో 4 నోటిఫికేషన్లు విడుదల.. వివరాలు తెలుసుకోండి..

అయితే తుది ఫలితాలు వెల్లడించిన సమయంలో అందరికీ మూడు మార్కులను కలిపినట్లు పేర్కొన్నారు. అయినా అభ్యర్థులకు మార్కులు తగ్గినట్లు చెబుతున్నారు. దీనికి ఫైనల్ కీ తో పాటు.. అర్హత సాధించని వారి మార్కులను కూడా వెల్లడించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇక అర్హత సాధించిన వారి జాబితాను ఇటీవల సింగరేణి యాజమాన్యం ఒక పీడీఎఫ్ ను విడుదల చేసింది. ఈ పరీక్షకు మొత్తం 98,882 మంది పరీక్ష రాయగా.. దీనిలో 77,898 మంది అర్హత సాధించినట్లు జాబితాను విడుదల చేశారు.

ఈ జాబితాలో మొత్తం తప్పుల తడకగా ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి పేరు కాకుండా.. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, డిగ్రీ, బోర్డ్ సెకండరీ ఎడ్యూకేషన్ వంటి పేర్లతో మార్కులను రిలీజ్ చేశారు. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాల్ టికెట్స్ లో అక్షరదోశాలు దొర్లాయి. దీనిలో శ్రీధర్ అనే పేరుకు బదులు(హాల్ టికెట్ నంబర్ 7709069) తెలంగాణ అనే పేరు ఉంది. మణికంఠ అనే అభ్యర్థి పేరు ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ అని రావడం, బి. లలిత అనే పేరు ప్లేస్ లో డిగ్రీ అని వచ్చింది. ఈ రకంగా గందరగోళంగా ఫలితాలు ఉండటంతో.. ఫలితాల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష హాల్లో ఇలా వారి నుంచి సంతకాలు తీసుకునే క్రమంలో అభ్యర్థి యొక్క ఐడెంటిటీని ఎందుకు తనిఖీ చేయలేదని.. స్కూల్లో యూనిట్ టెస్ట్ పరీక్షను ఎలా నిర్వహిస్తారో అంత కంటే ఘోరంగా ఈ పరీక్షను నిర్వహించినట్లు విమర్శిస్తున్నారు అభ్యర్థులు.

Police Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెడ్ కానిస్టేబుల్(HC), ASI పోస్టులకు నోటిఫికేషన్..

గతంలో కొంతమంది పైరవీ కారులు ఉద్యోగాల పేరుతో అభ్యర్థుల నుంచి భారీ మొత్తం వసూలు చేశారని ఆరోపణలు రావడంతో భూపాలపల్లికి చెందిన ఉద్యోగిని సింగరేణి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఎలాంటి ఆధారం లభించకపోవడంతో పంపించేశారు. కాకతీయ గెస్ట్‌హౌస్‌లో ఇద్దరు దళారులతోపాటు 40 మంది సింగరేణి కార్మికులను విచారించినట్లు సమాచారం.

అంతే కాకుండా.. పరీక్ష హాల్లో ఎలాంటి తనిఖీలు చేపట్టేలేదని.. కనీసం పరీక్ష హాల్లో ఆధార్, ఓటర్ ఐడీ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ ఒక్క ప్రూఫ్ ను కూడా చెక్ చేయలేదని వాపోతున్నారు. డిగ్రీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి పేర్లతో ఉన్న అభ్యర్థులను ఎలా పరీక్ష రాయనిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై సింగరేణి సంచాలకులు ఎం. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘పరీక్ష ఫలితాల్లో కేవలం మూడు తప్పులు మాత్రమే దొర్లాయని.. పొరపాటున అభ్యర్థి పేరు వద్ద రాష్ట్రాల పేర్లు, డిగ్రీ అని పడిందని తెలిపారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Singareni Collieries Company

ఉత్తమ కథలు