హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

After Inter Jobs: ఇంటర్ తో ఉద్యోగ అవకాశాలు.. ఈ కోర్సులతో రూ.5లక్షలకు పైగా ప్యాకేజీ..

After Inter Jobs: ఇంటర్ తో ఉద్యోగ అవకాశాలు.. ఈ కోర్సులతో రూ.5లక్షలకు పైగా ప్యాకేజీ..

After Inter Jobs: ఇంటర్ తో ఉద్యోగ అవకాశాలు.. ఈ కోర్సులతో రూ.5లక్షలకు పైగా ప్యాకేజీ..

After Inter Jobs: ఇంటర్ తో ఉద్యోగ అవకాశాలు.. ఈ కోర్సులతో రూ.5లక్షలకు పైగా ప్యాకేజీ..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది విద్యార్థులు తక్షణమే డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. దీనికి పలు రకాలు కారణాలు ఉండొచ్చు. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం.. డబ్బుతో అవసరం లాంటివి ఉండటంతో.. ఇంటర్ తో లేదా పదో తరగతితోనే చదువు బంద్ చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ప్రస్తుత రోజుల్లో చాలా మంది విద్యార్థులు తక్షణమే డబ్బు(Earn Money) సంపాదించాలనుకుంటున్నారు. దీనికి పలు రకాలు కారణాలు ఉండొచ్చు. ఇంటి ఆర్థిక పరిస్థితి(Financial Problems) బాగా లేకపోవడం.. డబ్బుతో అవసరం లాంటివి ఉండటంతో.. ఇంటర్ తో లేదా పదో తరగతితోనే చదువు బంద్ చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లు పది లేదా ఇంటర్(Intermediate) పూర్తికాగానే ఏదో ఒక ఉద్యోగం చేయాలని అనుకుంటారు. అలాంటి వారు ఏ రకమైన ఉద్యోగం చేయాలి.. అస్సలు ఇంటర్ తో ఉద్యోగ అవకాశాలు(Job Opportunity) ఎలా ఉన్నాయి.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

డిప్లొమా ఇన్‌ వెబ్‌ డిజైనింగ్‌ కోర్సులు

12వ తరగతి పాసయ్యాక కొన్ని షార్ట్ టర్మ్ కోర్సులు చేసి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. వాస్తవానికి, మీరు ఉద్యోగంలో ముందుకు సాగడానికి గ్రాడ్యుయేషన్ వరకు విద్య చాలా ముఖ్యం, అయితే ఈ స్వల్పకాలిక కోర్సుల తర్వాత మీరు మొదట్లో ఉద్యోగం పొందవచ్చు. 12వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన వారు డిప్లొమా ఇన్‌ వెబ్‌ డిజైనింగ్‌ కోర్సులు చేయవచ్చు. 3 నెలల నుంచి 9 నెలల వ్యవధిలో పూర్తి చేయవచ్చు. కోర్సు పూర్తి చేసిన తర్వాత, వెబ్ డిజైనర్ , డిజైనింగ్ ఎగ్జిక్యూటివ్ మొదలైన ఉద్యోగాలు పొందవచ్చు.

TSPSC Notification : టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్.. రేపే దరఖాస్తులకు చివరి తేదీ..

డిజిటల్ మార్కెటింగ్ కోర్సు

గత కొన్నేళ్లుగా డిజిటల్ మార్కెటింగ్ కోర్సులకు డిమాండ్ బాగా పెరిగింది. 12వ తరగతి నుండి గ్రాడ్యుయేట్ వరకు ఎవరైనా దీన్ని చేయవచ్చు. దీని వ్యవధి 3 నెలల నుండి 12 నెలల వరకు ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత, మీరు ఎగ్జిక్యూటివ్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ మరియు డిజిటల్ మార్కెటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Police Jobs 2022: 12వ తరగతి అర్హతతో.. సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్..

హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు..

హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు ఎవర్ గ్రీన్ కోర్సులుగా పరిగణించబడతాయి. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సు యొక్క వ్యవధి 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత చెఫ్ , రిసెప్షనిస్ట్, రూమ్ సర్వీస్ స్టాఫ్, మేనేజర్ మొదలైన పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Software Jobs: ఉద్యోగుల సంఖ్యను 10వేలకు పెంచుకోనున్న సంస్థ.. 2500 వరకు ఉద్యోగాలు ఖాళీ..

పై మూడు కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. వార్షిక ప్యాకేజీ కూడా రూ.5లక్షల నుంచి మొదలవుతుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Intermediate, JOBS

ఉత్తమ కథలు