ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Andhra Pradesh Public Service Commission) ఇటీవల పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను(Notifications) విడుదల చేసింది. దీనిలో ముఖ్యంగా గ్రూప్ 1 (Group 1) పోస్టులతో పాటు.. రవాణా శాఖ, ఆయుర్వేద, హోమియోపతి, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
1. గ్రూప్ 1 పోస్టులు
రాష్ట్రంలో అత్యున్న ఉద్యోగాల కోసం నిర్వహించే గ్రూప్ 1 నోటిఫికేషన్(Notification) ను ఏపీపీఎస్సీ(APPSC) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 2 వరకు దరఖాస్తు ప్రక్రియకు అవకాశం కల్పించారు. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
డివిజినల్/ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు బీఈ(ఫైర్) ఉత్తీర్ణులై ఉండాలి.
01/07/2022 నాటికి డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సివిల్) పోస్టులకు 21-30 ఏళ్లు, డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్(మెన్) ఖాళీలకు 18-30 ఏళ్లు, డివిజినల్/ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు 21-28 ఏళ్లు, మిగిలిన వాటికి 18 - 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మార్చి 15, 2023 తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://psc.ap.gov.in సందర్శించొచ్చు.
2.అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు(AMVI)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17 పోస్టుల భర్తీ కోసం AMVI నోటిఫికేషన్ 2022ని విడుదల చేశారు. ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసకోవచ్చు. AMVI దరఖాస్తు ఆన్‌లైన్ ప్రక్రియ 2వ నవంబర్ 2022 నుండి ప్రారంభమవుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ 22 నవంబర్ 2022గా పేర్కొన్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. బ్యాచిలర్ డిగ్రీ(మెకానికల్ ఇంజినీరింగ్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్) లేదా డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజినీరింగ్) ఉండాలి. మోటారు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం, హెవీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల ఎండార్స్‌మెంట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు అనేది 21-36 ఏళ్ల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-1, పేపర్-2 ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలకు వెబ్‌సైట్ https://psc.ap.gov.in సందర్శించొచ్చు.
3. హోమియోపతి మెడికల్ ఆఫీసర్ ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో 53 మెడికల్ ఆఫీసర్(హోమియోపతి) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్స ఉంటుంది. హోమియోపతిలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 - 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అక్టోబర్ 6, 2022 నుంచి ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. చివరి తేదీ అక్టోబర్ 20, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాత పరీక్ష నవంబర్ లో ఉండనుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://psc.ap.gov.in సందర్శించొచ్చు.
4. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆయుష్ విభాగంలో 72 మెడికల్ ఆఫీసర్(ఆయుర్వేద) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి కూడా ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఆయుర్వేదంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల యొక్క వయస్సు అనేది
18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు రుసుము రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 6, 2022 నుంచి ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. చివరి తేదీ అక్టోబర్ 20, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.రాత పరీక్ష నవంబర్ లో ఉండనుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://psc.ap.gov.in సందర్శించొచ్చు.
5. నాన్-గెజిటెడ్ ఉద్యోగాలు ..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 45 నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. శాంపిల్ టేకర్(ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ (హెల్త్) సబ్-సర్వీస్) 12 పోస్టులు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ (ఏపీ ఇండస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్) 08 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సబ్ సర్వీస్) 04 పోస్టులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 08 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) (ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్) 04 పోస్టులు, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్-2 (ఏపీ జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీస్) 03 పోస్టులు, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ (ఏపీ ఫిషరీస్ సబ్ సర్వీస్) 03 పోస్టులు, టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (ఏపీ టౌన్, కంట్రీ ప్లానింగ్) 02 పోస్టులు, జూనియర్ ట్రాన్స్‌లేటర్ (తెలుగు) (ఏపీ ట్రాన్స్‌లేషన్ సబార్డినేట్ సర్వీస్) 01 పోస్టు ఖాళీగా ఉన్నాయి.
పోస్టును అనుసరించి పదోతరగతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి యొక్కవ వయస్సు జూలై 01, 2022 నాటికి డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టులకు 25 నుంచి 42 ఏళ్ల మధ్య, మిగిలిన ఖాళీలకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియం అక్టోబర్ 11 నుంచి ప్రారంభం అవుతుండగా.. నవంబర్ 2, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://psc.ap.gov.in సందర్శించొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: APPSC, Career and Courses, JOBS