Home /News /jobs /

COMMON UNIVERSITY ENTRANCE TEST FOR UNDERGRADUATE RESULTS LIKELY TO BE ANNOUNCED IN EARLY SEPTEMBER GH SRD

CUET UG Results: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CUET UG Results: జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అడ్మిషన్ల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. మొత్తం ఆరు దశల పరీక్షలు ఆగస్టు 30వ తేదీతో ముగుస్తాయి. అయితే వీటి ఫలితాల (CUET UG Results)ను..

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అడ్మిషన్ల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (Common University Entrance Test) ఏటా నిర్వహిస్తుంటారు. గతంలో ఒక్కో సెంట్రల్ యూనివర్సిటీలోని అడ్మిషన్ల కోసం ఒక్కో ఎంట్రన్స్ టెస్ట్‌ రాయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ యూనివర్సిటీలు, కాలేజీలలోని అడ్మిషన్లకు ఒకే ఒక పరీక్ష CUETతో పోటీపడవచ్చు. కాగా ఈ ఏడాది జులై 15న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడు దశల్లో పరీక్షలు జరగగా... ఇంకా మూడు దశల పరీక్షలు జరగాల్సి ఉంది. మొత్తం ఆరు దశల పరీక్షలు ఆగస్టు 30వ తేదీతో ముగుస్తాయి. అయితే వీటి ఫలితాల (CUET UG Results)ను సెప్టెంబర్ నెల ప్రారంభంలో ప్రకటించొచ్చని తెలుస్తోంది.

కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తోంది. ఈసారి సాంకేతిక లోపాల కారణంగా పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఈ వాయిదాల వల్ల ఆరు దశల్లో జరుగుతున్న పరీక్షలు జులై 15న ప్రారంభమై ఆగస్టు 30న ముగియనున్నాయి. సెప్టెంబర్ నెల ప్రారంభంలో CUET-UG ఫలితాలు NTA వెబ్‌సైట్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది.



విద్యార్థులు తమ మార్కులను nta.ac.in లేదా cuet.nta.nic.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. విడుదలైన ఫలితాలను వివిధ సంబంధిత సెంట్రల్, ఇతర యూనివర్సిటీలకు పంపిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా యూనివర్సిటీలు, కాలేజీలు కటాఫ్ లిస్ట్‌ విడుదల చేస్తాయి. ఆ తర్వాత కాలేజీలలో మొదటి సంవత్సరం కొత్త సెషన్ ప్రారంభమవుతుంది.

* ఫేజ్‌ 5 పరీక్షలకు 17న అడ్మిట్‌ కార్డులు
ఇప్పటివరకు జరిగిన 3 దశల్లో 6.31 లక్షల మంది విద్యార్థులు CUET-UG పరీక్షలకు హాజరయ్యారు. ఆగస్టు 17, 18, 20 తేదీల్లో జరగనున్న CUET-UG పరీక్షల నాల్గవ దశకు అభ్యర్థులకు అడ్మిట్ కార్డ్‌లు జారీ చేస్తున్నారు. ఈ దశలో మొత్తం 3.72 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా..! రేపటితో ముగుస్తున్న గడువు..

NTA ప్రకారం, CUET-UG ఫేజ్‌ 5 పరీక్ష ఆగస్టు 21, 22, 23 తేదీలలో జరుగుతుంది. ఈ పరీక్షకు అడ్మిట్ కార్డ్ ఆగస్టు 17న జారీ చేయనున్నారు. యూజీసీ చైర్మన్ ఎం. జగదీష్ కుమార్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పరీక్ష రాసే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి నచ్చిన నగరాలను ఎగ్జామ్ సెంటర్‌గా కేటాయించారు.

అయితే, దాదాపు 11,000 మంది అభ్యర్థులు తమకు నచ్చిన నగరాలను పరీక్ష కేంద్రంగా పొందలేకపోయారు. దాంతో అధికారులు వారిని దశ 6కి పరీక్షలకు మార్చారు. సాంకేతిక కారణాల వల్ల లేదా సెంటర్ రద్దు చేయడం వల్ల ఆగస్టు 4, 5, 6 తేదీల్లో జరిగిన ఫేజ్ 2లో హాజరు కాలేకపోయిన అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి 30 వరకు జరిగే 6వ దశ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతిస్తారు. ఈ విద్యార్థులకు ఆగస్టు 20న అడ్మిట్ కార్డు జారీ చేస్తారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Cuet, CUET 2022, EDUCATION, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు