COMMON LAW ADMISSIONS TEST FOLLOW THESE TIPS TO GET THE BEST SCORE IN CLAT GH EVK
Common Law Admissions Test: 'క్లాట్'లో ఉత్తమ స్కోర్ సాధించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ప్రతీకాత్మక చిత్రం
Common Law Admissions Test | ప్రతిష్టాత్మక లా ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో ‘కామన్ లా అడ్మిషన్స్ టెస్ట్’(CLAT) ఒకటి. ఈ పరీక్షను నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం నిర్వహించనుంది. తద్వారా దేశంలోని 22 నేషనల్ లా యూనివర్శిటీల్లో UG, PG కోర్సుల కోసం అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు.
ప్రతిష్టాత్మక లా ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో ‘కామన్ లా అడ్మిషన్స్ టెస్ట్’(CLAT) ఒకటి. దేశంలోని టాప్ నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ ప్రక్రియను CLAT స్కోర్ ఆధారంగా చేపట్టనున్నారు. ఈ పరీక్షను నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం నిర్వహించనుంది. తద్వారా దేశంలోని 22 నేషనల్ లా యూనివర్శిటీ (National Law University) ల్లో UG, PG కోర్సుల కోసం అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు.
ఈ ఏడాది CLAT పరీక్షను రెండు సార్లు నిర్వహించనున్నారు. 2022కు సంబంధించిన పరీక్ష జూన్ 19న జరగనుంది. అలాగే 2023కు సంబంధించిన పరీక్ష ఈ ఏడాది డిసెంబర్ 18న నిర్వహించనున్నారు. క్లాట్-2022 పరీక్షకు సమయం చాలా తక్కువగా ఉన్నందునా, అభ్యర్థులు ప్రత్యేక వ్యూహంతో సన్నద్ధమవ్వాలి. అయితే, అంత కంటే ముందు అభ్యర్థులకు సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండాలి. నెగెటివ్ మార్కింగ్ విధానంలోని పరీక్ష సరళిని లోతుగా పరిశీలించాలి.
క్లాట్-2022 సిలబస్
కామన్ లా అడ్మిషన్స్ టెస్ట్‌లో ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, లీగల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలను అడగనున్నారు.
సబ్జెక్టుల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలు
క్లాట్-2022లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు పూర్తిగా విశ్లేషణాత్మక దృక్పథంతో వ్యవహరించాలి. మొత్తం అయిదు సబ్జెక్ట్‌లలో అయిదు సెక్షన్లుగా నిర్వహించే క్లాట్ టెస్ట్‌లో విజయానికి అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలు..
ఇంగ్లీష్ లాంగ్వేజ్
ఈ విభాగం నుంచి దాదాపు 28-32 ప్రశ్నలు ఉంటాయి. ప్యాసేజ్ రీడింగ్‌పై అవగాహన ఉండాలి. అలాగే, వ్యాకరణం, పదజాలం, తార్కిక నైపుణ్యాలను పెంచుకోవాలి. ఇందు కోసం జనరల్ ఎస్సేలు, న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్‌ను చదవాలి. మొత్తం ఆంగ్ల విభాగాన్ని మెరుగుపర్చుకోవడానికి కొన్ని నిర్దిష్ట అంశాలపై పట్టుసాధించాలి. ముఖ్యంగా ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు, టెన్సెస్, లోపాలు గుర్తించడం, యాక్టివ్ & పాసివ్ వాయిస్, పర్యాయపదాలు & వ్యతిరేక పదాలు, ఖాళీలు పూరించడం వంటి అంశాల్లో తరువుగా ప్రిపేర్ అవ్వాలి.
గణితం
ఈ సెక్షన్‌ను వాణిజ్య గణితం, మెన్సురేషన్, ఆధునిక గణితం, డేటా ఇంటర్‌ప్రెటేషన్, అర్థమెటిక్ మొత్తం ఐదు వర్గాలుగా విభజించారు. గతంలో నిర్వహించిన పరీక్షల పేపర్లను తిరగేడంతో పాటు ఈ టాఫిక్‌పై ప్రాబ్లమ్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్
బిజినెస్ పేపర్‌తోపాటు అన్ని వార్తాపత్రికలను రోజువారి చదివే అలవాటు చేసుకుంటే ఈ విభాగంలో బాగా స్కోర్ చేసే అవకాశం ఉంది. సైన్స్, కల్చర్, ఎకనామిక్స్, హిస్టరీ, ఫిలాసఫీ, జాగ్రఫీ సబ్జెక్టుల్లో ప్రాథమిక స్థాయిలో లోతుగా అధ్యయనం చేయాలి.
లీగల్ రీజనింగ్
ఈ విభాగంలో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలే ఉంటాయి. సంబంధిత ప్యాసేజ్‌ల నుంచి నిబంధనలు, సిద్ధాంతాలు, ఫ్యాక్ట్స్ వాటి ద్వారా చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు న్యాయపరమైన దృక్పథం, సహేతుక ఆలోచన ధోరణి, నిర్ణయ సామర్థ్యాలను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యమైన చట్టాలు, న్యాయ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, లీగల్ టెర్మినాలజీపై అవగాహన పెంచుకుంటే ఈ విభాగంలో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.
లాజికల్ రీజనింగ్
అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఈ విభాగంలో ప్రశ్నలు ఉంటాయి. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు; అసెర్షన్ అండ్ రీజనింగ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందుకోసం సిలాజిజమ్, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్ వంటి అంశాలపై అవగాహన పొందాలి. స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నల కోసం కంపేరిటివ్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.