Home /News /jobs /

COMMENCEMENT OF TELANGANA ICET REGISTRATION PROCESS APPLICATION PROCESS EXAM DATE OTHER DETAILS HERE GH VB

TS ICET 2022: తెలంగాణ ఐసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ డేట్, ఇతర వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఐసెట్)-2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి (ఏప్రిల్6) ప్రారంభమైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందించే కాలేజీల్లో ప్రవేశాల కోసం ఐసెట్ నిర్వహిస్తారు.

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET - 2022)కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి (ఏప్రిల్6) ప్రారంభమైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందించే కాలేజీల్లో ప్రవేశాల కోసం ఐసెట్(Icet) నిర్వహిస్తారు. జూన్ 27 వరకు ఎలాంటి రుసుము లేకుండా tsche.ac.in వెబ్‌సెట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తుది అప్లికేషన్ సమర్పించిన తరువాత అప్లికేషన్ ఫారంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే, అందుకోసం జూలై 13 నుంచి 17వరకు ఐదు రోజుల సమయం కేటాయించారు.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరఫున వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ICET 2022 ఎగ్జామ్‌ను నిర్వహించనుంది. జూలై 18 నుంచి అడ్మిట్ కార్డులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుండగా... ఐసెట్ పరీక్షను జూలై 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు.

Telangana Government: పోటీ పరీక్షల కోసం స్కాలర్ షిప్‌లతో పాటు ఉచిత శిక్షణ తరగతులు.. ప్రభుత్వం ఏర్పాట్లు..


TS ICET 2022 కోసం అవసరమైన డాక్యుమెంట్స్
టీఎస్ ఐసెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసే ముందు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

మొత్తం అకడమిక్ రికార్డ్స్. గతం, ప్రస్తుత తరగతులకు సంబంధించిన సర్టిఫికెట్లు, స్కాన్ చేసిన రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్ చేసిన సంతకం కాపీ, కేటగిరి సర్టిఫికేట్( ఒకవేళ ఉంటే), దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించడానికి డెబిట్/క్రెడిట్ లేదా ఏదైనా ఇతర బ్యాంకింగ్ వివరాలు.
భవిష్యత్‌లో కమ్యూనికేషన్ కోసం కాంటాక్ట్ వివరాలు, చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ID, ఫోన్ నంబర్ తదితర వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు లేదా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం

స్టెప్ 1: TS ICET 2022 అధికారిక పోర్టల్‌కి లాగిన్ అవ్వండి

స్టెప్ 2: డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి TS ICET 2022 అప్లికేషన్ ఫీజు చెల్లించండి

స్టెప్ 3: ఫీజు చెల్లించిన తరువాత రసీదుని సేవ్ చేయండి

స్టెప్ 4: మీ వివరాలను నమోదు చేస్తూ దరఖాస్తు ఫారంను పూర్తి చేయండి

స్టెప్ 5: నిర్ణీత ఫార్మాట్‌‌‌లో అవసరమైన డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీలను అటాచ్ చేయండి

స్టెప్ 6: TS ICET 2022 దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి రసీదును ప్రింట్ అవుట్ తీసుకోండి

అప్లికేషన్ ఫీజు వివరాలు

TS ICET 2022 కోసం దరఖాస్తు రుసుము రూ.650గా నిర్ణయించారు. దీనికి అదనంగా సర్వీస్ చార్జీలను వసూలు చేయనున్నారు. SC/ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుములో రూ.200 రాయితీ పోను రూ. 450 చెల్లించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తారు. ఇక ఆలస్యంగా రుసుము దాదాపు రూ.1000 వరకు ఉండనుంది.

Jobs in Andhra Pradesh: నాలుగు జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు ఈ రెండు రోజులే చాన్స్‌

పరీక్ష విధానం
TS ICET 2022 కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ఇందులో 200 MCQలు ఉంటాయి. ఇందుకోసం రెండున్నర గంటల పాటు సమయం కేటాయించనున్నారు. ప్రశ్నాపత్రం మూడు సెక్షన్‌లుగా విశ్లేషణాత్మక సామర్థ్యం, ​​గణిత సామర్థ్యం, కమ్యూనికేషన్ సామర్థ్యంగా విభజించారు. టీఎస్ ఐసెట్ పరీక్ష ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ మీడియంలో నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Entrance exams, TS ICET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు