హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Colorado State University: ఇండియన్ స్టూడెంట్స్‌కు అమెరికా​ యూనివర్సిటీ గుడ్‌న్యూస్.. జీమ్యాట్, జీఆర్‌ఈ స్కోర్‌తో సంబంధం లేకుండా ప్రవేశాలు

Colorado State University: ఇండియన్ స్టూడెంట్స్‌కు అమెరికా​ యూనివర్సిటీ గుడ్‌న్యూస్.. జీమ్యాట్, జీఆర్‌ఈ స్కోర్‌తో సంబంధం లేకుండా ప్రవేశాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

భారతీయ విద్యార్థులకు అమెరికాలోని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ (CSU) బంపరాఫర్ ప్రకటించింది. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (MCIS) కోర్సును ఇంటి వద్ద నుంచి చేసుకునే అవకాశం కల్పించింది.

భారతీయ విద్యార్థులకు (Indian students) అమెరికా (America)లోని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ (Colorado State University) బంపరాఫర్ ప్రకటించింది. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (MCIS) కోర్సును ఇంటి వద్ద నుంచి చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం యూనివర్సిటీ... ‘లీప్ స్కాలర్’ అనే Edtech కంపెనీతో చేతులు కలిపింది. ఇది US డిగ్రీలను హైబ్రిడ్ ఫార్మాట్​లో అందజేస్తుంది. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సును 18 నెలల పాటు ఆన్‌లైన్ - క్యాంపన్ కాంబినేషన్‌లో నిర్వహించనున్నారు. ఆగస్టు నుంచి ఈ కోర్సు (Course) ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారతీయ విద్యార్థుల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై1 గా నిర్ణయించారు. ఈ కోర్సు చేయడానికి అర్హత ప్రమాణాల్లో భాగంగా GRE/GMAT స్కోర్‌ అవసరం లేదు. విద్యార్థులు తమ ఖర్చులను తగ్గించుకోవడం కోసం స్కాలర్‌షిప్‌లు, రుణాల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

హైబ్రిడ్ ఫార్మాట్‌లో..

మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (MCIS) ప్రోగ్రామ్ US News అండ్ వరల్డ్ రిపోర్ట్ -2022లో టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం మూడు సెమిస్టర్లుగా విభజించారు. మొదటిది ఇంటి నుంచే చేసుకోవడానికి అవకాశం కల్పించగా.. మరో రెండు సెమిస్టర్లు కొలరాడోలోని యూనివర్సిటీ (Colorado State University) క్యాంపన్‌లో భారతీయ విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుందని ఎడ్‌టెక్ కంపెనీ వెల్లడించింది. హైబ్రిడ్ ఫార్మాట్‌ (Hybrid format)లో ఈ కోర్సును నిర్వహించడం వల్ల మొత్తం ఖర్చుల్లో దాదాపు 30 శాతం తగ్గిపోనుంది. ఈ ప్రోగ్రామ్ కోసం యూఎస్ కరెన్సీలో 24,749 డాలర్లు కాగా, ఇండియన్ కరెన్సీలో దాదాపు 19 లక్షల వ్యయం కానుంది.

మూడేళ్ల పోస్ట్- వర్క్ వీసా..

మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (MCIS) ప్రోగ్రామ్ STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం) హోదాను కలిగి ఉంది. దీంతో యూఎస్‌లో పుల్‌టైమ్ ఫారిన్ స్టూడెంట్ మాదిరి భారతీయ విద్యార్థులు కూడా మూడేళ్ల పోస్ట్- వర్క్ వీసా (Post work Visa) పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా క్లిష్టమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో ముడిపడి ఉన్న ఆచరణాత్మక అనుభవాన్ని విద్యార్థులు పొందుతారని ఎడ్‌టెక్ పేర్కొంది.

CSU కాలేజ్ ఆఫ్ బిజినెస్ అండ్ డిపార్ట్‌మెంట్ చైర్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ లియో విజయసారథి మాట్లాడుతూ... "లీప్‌స్కాలర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం తమ యూనివర్సిటీ కళాశాల మిషన్‌ను ప్రతిబింబిస్తుందన్నారు. మెరుగైన ప్రపంచం కోసం సమాచార సాంకేతికతను ఉపయోగించుకొని భవిష్యత్తు బిజినెస్ లీడర్లకు అవగాహన కల్పించడం కోసం అత్యుత్తమ, నాణ్యమైన ప్రోగ్రామ్‌ను విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. STEM హోదా ఉన్న మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ భారతీయ విద్యార్థులకు హైబ్రిడ్ ఫార్మాట్‌లో సరసమైన డిగ్రీని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు అమెరికాలో అనేక సంవత్సరాల పని అనుభవాన్ని పొందగల సామర్థ్యం వస్తుందన్నారు. ఈ ప్రోగ్రామ్ ఆన్‌లైన్ లెర్నింగ్ అండ్ ఆన్-క్యాంపస్ అనుభవాన్ని మిలితం చేస్తుందని లియో విజయసారథి పేర్కొన్నారు.

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Higher education, New course, University

ఉత్తమ కథలు