Home /News /jobs /

COLLEGE DROP OUT CAB DRIVER TURNS SOFTWARE DEVELOPER CREDITS ONLINE CODING COURSE GH VB

Success Story: క్యాబ్ డ్రైవర్ జీవితాన్ని మార్చిన ఆన్‌లైన్ కోర్సు.. టాప్ కంపెనీలో ఉద్యోగం.. అతడి సక్సెస్ స్టోరీ తెలుసుకోండి..

ఆశిష్

ఆశిష్

కుటుంబ అవసరాల కోసం క్యాబ్ డ్రైవర్‌గా మారిన ఒక పేద వ్యక్తి.. ఒక ఆన్‌లైన్ కోర్సు సాయంతో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఎదిగాడు. అతడి సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం.

పట్టుదల ఉంటే ఎంతటి పెద్ద పనినైనా పూర్తి చేయవచ్చు. కష్టమైన లక్ష్యాలనైనా సులభంగా చేరుకోవచ్చు. అయితే ఇంతకు కాస్త సమయం పట్టవచ్చు. కొంతమంది వివిధ అవసరాల కోసం తమ లక్ష్యాలను తాత్కాలికంగా పక్కన పెట్టినా, వాటిని ఛేదించేంత వరకు వదలిపెట్టరు. ఇలా క్యాబ్ డ్రైవర్‌గా(Cab Driver) మారిన ఒక పేద వ్యక్తి.. ఒక ఆన్‌లైన్ కోర్సు(Online Course) సాయంతో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా(Software Developer) ఎదిగాడు. అతడి సక్సెస్ స్టోరీ(Success Story) తెలుసుకుందాం. రైతు కుటుంబంలో జన్మించిన బీహార్‌లోని ముంగేర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ సక్సెస్ స్టోరీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తన చదువు కోసం ఎంతో కష్టపడ్డాడు ఆశిష్. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పదో తరగతి పూర్తి చేసిన తరువాత పైచదువుల కోసం మధ్యప్రదేశ్‌కు పయనమయ్యాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా మేరకు భోపాల్‌లో డిప్లొమో ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. మొదటి ఏడాది కాలేజీ ఫీజు తన తండ్రి కట్టాడు. అయితే తన అవసరాలను సరిపడా డబ్బులు లేక తీవ్ర అవస్థలు పడ్డాడు.

Ear Piercing Ceremony: చెవులు కుట్టే వేడుకకు హాజరైన ‘చనిపోయిన అన్న’..! అస్సలు ఏం జరిగిందంటే..


‘‘ఆర్థికంగా సపోర్ట్ లేకపోవడంతో జీవితంలో ఎదగటానికి అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయాను. బీహార్‌లో పెరిగిన యువతకు లక్ష్యం ఒక్కటే.. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం. కానీ నేను స్కూల్‌లో చదువుకున్న రోజుల్లో ఎలక్ట్రికల్ లేదా సివిల్ ఇంజనీర్ కావాలని అనుకునేవాడిని. ఎందుకంటే ఆర్థికంగా బాగాలేకపోవడంతో మంచి ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఇదే దగ్గరి దారి’’ అని ఆశిష్ చెప్పుకొచ్చాడు.

‘మొదటి ఏడాది పాసైనా రెండో ఏడాది చదువు కోసం డబ్బు చాలా అవసరం. అప్పటికే రెండో ఏడాది పాసైనా ఉద్యోగం లేక చాలా మంది పడ్డ అవస్థలను నేను గమనించా. దీంతో నా చదువు కోసం అప్పు చేయడానికి సాహసించలేకపోయా. మరోపక్క ఇంటిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో అవసరాల కోసం ఇతర పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని ఆశిష్ వివరించాడు.

దీంతో అవసరాల కోసం ఆశిష్ కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఇందుకు తన బంధువు సహాయం తీసుకున్నాడు. డ్రైవింగ్ లైస్సెన్స్ తీసుకుని భోపాల్‌లో ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిలో చేరాడు. ఈ విషయం తెలుసుకున్న ఆశిష్ కుటుంబ సభ్యులు నిరాశ చెందారు. చదువుకోవడానికి అంత వరకు ఖర్చుపెట్టిన డబ్బు వృథా అయిందని బాధపడ్డారు. మరోపక్క అతడికి చదువుకోవడానికి తగిన సమయం దొరకడం లేదు. డ్రైవింగ్ మాసేసి చదువుపై దృష్టి సారించాలంటే సరిపడేంత డబ్బు లేదు. దీంతో డ్రైవింగ్ కొనసాగించాలని ఆశిష్ నిర్ణయించుకున్నాడు.

అయితే మసాయిలో పుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌పై షార్ట్ టర్మ్ కోర్సు అందిస్తున్నారని తెలుసుకున్నాడు ఆశిష్. దీంతో డ్రైవింగ్ చేస్తూనే కోచింగ్ సెంటర్‌లో చేరాడు. HTML, CSS, జావా స్క్రిప్ట్ తోపాటు MERN stackపై పట్టుసాధించాడు. ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ లింక్డ్‌ఇన్‌లో క్లోన్‌ను తయారు చేశాడు. ఇలా ఆన్‌లైన్ కోర్సులతో కోడింగ్‌పై పట్టు సాధించాడు.

Viral News: పాల ప్యాకెట్‌పై 'IIM Alumni' ట్యాగ్... దీని ఉద్దేశం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్ల చర్చ

కోర్సు పూర్తిచేసిన తరువాత ఉద్యోగం సంపాధించడానికి ఆశిష్‌కు మూడు వారాల సమయం పట్టింది. గతంలో ఇంటర్వ్యూలను ఫేస్ చేసిన అనుభవం లేకపోవడంతో మొదట్లో ఉద్యోగాన్ని పొందలేకపోయాడు. అలా ఐదు, ఆరు ఇంటర్వ్యూలకు వెళ్లి తనను తాను మరింత మెరుగుపర్చుకున్నాడు. WebEngageలో ఉద్యోగం కోసం మొదట కోడింగ్ టెస్ట్ ఎదురుకోవాల్సి వచ్చింది.

తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత మేనేజర్ , హెచ్‌ఆర్‌తో ఇంటర్వ్యూ విజయంతంగా ముగించి చివరికి ఉద్యోగంలో చేరాడు. టెక్ ఉద్యోగాల్లో కమ్యూనికేషన్, అవగాహన చాలా ముఖ్యమైన అంశాలని ఆశిష్ అంటాడు. డబ్బులు లేక డ్రైవర్‌గా చేరి మధ్యలో కోచింగ్ తీసుకుని సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారడం.. నిజంగా నేటి యువతకు ఆశిష్ రాజ్ ఆదర్శంగా నిలుస్తాడు అనడంలో సందేహం లేదు.
Published by:Veera Babu
First published:

Tags: IT jobs, Software, Success story

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు