Home /News /jobs /

COLLEGE BEGIN ADMISSIONS EVEN AS CBSE 12TH RESULTS AWAITED BOARD ASKS UGC TO INTERVENE UMG GH

CBSE Colleges: సీబీఎస్‌ఈ 12th రిజల్ట్ రాకముందే డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం.. UGCకి బోర్డు కంప్లైంట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CBSE ఫలితాల ప్రకటన తేదీని దృష్టిలో ఉంచుకుని కాలేజీలు అడ్మిషన్ క్యాలెండర్‌ ప్లాన్ చేసుకునేలా అన్ని ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించాలని బోర్డు UGCని కోరింది. దీనికి సంబంధించి అన్ని యూనివర్సిటీలకు అధికార యంత్రాంగం హెచ్చరిక పంపుతుందని యూజీసీ వర్గాలు పేర్కొంటున్నాయ

ఇంకా చదవండి ...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. ఈ పరీక్షలు (Exams) రాసిన లక్షలాది మంది విద్యార్థులు రిజల్ట్ (Results) కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఒకవైపు విద్యార్థులు రిజల్ట్ కోసం ఎదురుచూస్తుండగా, మరోవైపు చాలా కాలేజీలు ఇప్పటికే అడ్మిషన్ ప్రాసెస్ చేపట్టాయి. దీనివల్ల ఫైనల్ రిజల్ట్ కోసం ఎదురుచూసి, ఆలస్యంగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు చదువుల్లో వెనుకబడే అవకాశం ఉందని సీబీఎస్‌ఈ ఆందోళన వ్యక్తం చేసింది. 12వ తరగతి ఫలితాలు ప్రకటించకముందే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు కాలేజీలు అడ్మిషన్లు ప్రారంభించడంపై చర్యలు తీసుకోవాలని బోర్డు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)ను ఆశ్రయించింది.

CBSE ఫలితాల ప్రకటన తేదీని దృష్టిలో ఉంచుకుని కాలేజీలు అడ్మిషన్ క్యాలెండర్‌ ప్లాన్ చేసుకునేలా అన్ని ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించాలని బోర్డు UGCని కోరింది. దీనికి సంబంధించి అన్ని యూనివర్సిటీలకు అధికార యంత్రాంగం హెచ్చరిక పంపుతుందని యూజీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి: కొవ్వొత్తి, అగ్గిపెట్టె ఉందని కేసు..! కోర్టులో పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?


ముంబై యూనివర్సిటీ (MU) సహా అనేక విద్యా సంస్థలు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్లు ప్రారంభించాయి. దీంతో CBSE దీనిపై దృష్టి సారించింది. ప్రస్తుతం ముంబై యూనివర్సిటీ కాలేజీ అడ్మిషన్ల కోసం రెండు మెరిట్ జాబితాలను విడుదల చేసింది. ఫలితంగా 12వ తరగతి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న అనేక మంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. సీబీఎస్‌ఈ ఫలితాల ఆలస్యం వల్ల సీట్లు, మంచి కాలేజీల్లో అడ్మిషన్ కోల్పోయే అవకాశం ఉందని విద్యార్థులు వాపోతున్నారు. మహారాష్ట్రతో పాటు తమిళనాడులోని అన్ని ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ కాలేజీలు జూన్ 20న స్టేట్ బోర్డ్ ఫలితాలను ప్రకటించాయి. ఆ తర్వాత కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించాయి.

కొత్త అడ్మిషన్లపై సీబీఎస్‌ఈ జూన్ 28న UGCకి ఒక లేఖ రాసింది. ‘భారతదేశంలోని కొన్ని యూనివర్సిటీలు, ముఖ్యంగా మహారాష్ట్రలో 2022- 23 సెషన్ కోసం అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ ప్రక్రియకు ఆఖరి తేదీలు జులై మొదటి వారంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే 12వ తరగతి ఫలితాల ప్రకటన తేదీని దృష్టిలో ఉంచుకుని అన్ని యూనివర్సిటీలు తమ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ ప్రక్రియ చివరి తేదీని నిర్ణయించాల్సిందిగా ఆదేశించాలని కోరుతున్నాం.’ అని అందులో పేర్కొంది.



ఫలితాలను సిద్ధం చేయడానికి దాదాపు నెల రోజులు అవసరమని బోర్డు పేర్కొంది. CBSE ఈ సంవత్సరం 10, 12 తరగతుల పరీక్షలను కొత్త ఫార్మాట్‌లో నిర్వహించింది. యాన్యువల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కాకుండా ఈసారి ఒక్కో తరగతికి రెండు టర్మ్‌లలో బోర్డు పరీక్షలు నిర్వహించారు. టర్మ్ 1లో విద్యార్థులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉండగా, టర్మ్ 2 పరీక్షలు సబ్జెక్టివ్‌గా ఉన్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, CBSE, Degree students, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు