ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్... కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్స్‌కి రూ.4 లక్షల వేతనం

Cognizant | డిజిటల్ టెక్నాలజీస్‌లో 'ప్రీమియం' స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే వేతనాలు పెంచినట్టు కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అందుకే ఎంట్రీ-లెవెల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి ప్రారంభ వేతనం పెంచుతున్నట్టు చెప్పారు.

news18-telugu
Updated: May 30, 2019, 2:38 PM IST
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్... కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్స్‌కి రూ.4 లక్షల వేతనం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ఎంట్రీ-లెవెల్ ఇంజనీర్లకు 18 శాతం అధికంగా వేతనాలను ఇవ్వనుంది కాగ్నిజెంట్‌. 2020 జూన్ నాటికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వారికి ప్రస్తుతం ఫ్రెషర్స్‌కి ఇస్తున్న రూ.3.38 లక్షల వార్షిక వేతనం కాకుండా రూ.4 లక్షల వార్షిక వేతనాన్ని ఇవ్వాలని కాగ్నిజెంట్ నిర్ణయించినట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది ఐటీ కంపెనీలు ఆగస్ట్-సెప్టెంబర్ నెలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఆఫర్ లెటర్స్ ఇవ్వనున్నాయి. డిజిటల్ టెక్నాలజీస్‌లో 'ప్రీమియం' స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే వేతనాలు పెంచినట్టు కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అందుకే ఎంట్రీ-లెవెల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి ప్రారంభ వేతనం పెంచుతున్నట్టు చెప్పారు.

ఐటీ రంగంలో డిజిటల్ టాలెంట్ అవసరాలు పెరుగుతున్నాయని, కాగ్నిజెంట్ కూడా ఉద్యోగుల స్కిల్స్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2018లో కాగ్నిజెంట్ 1.5 లక్షల మంది ఉద్యోగుల్లో డిజిటల్ స్కిల్స్ పెంచాయి. కాగ్నిజెంట్ ప్రతీ ఏడాది సగటున 15,000-20,000 మంది ఫ్రెషర్స్‌ని నియమించుకుంటోంది. ఇప్పటి వరకు ఎంట్రీ-లెవెల్ ఉద్యోగుల వార్షిక వేతనం రూ.3.30 లక్షల నుంచి రూ.3.60 లక్షల మధ్య ఉంది. ఇకపై ఫ్రెషర్స్‌కి రూ.4 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. డిజిటల్ సొల్యూషన్స్ ద్వారా 33 శాతం ఆదాయం పొందుతోంది కాగ్నిజెంట్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ నుంచి ఎక్కువగా నియామకాలు చేపడుతోంది. గత మూడేళ్లలో ఐఐటీల్లో 500 మంది నియమించుకుంది.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 107 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: బెనారస్ హిందూ యూనివర్సిటీలో 439 ఉద్యోగాలుJobs: ఈపీఎఫ్ఓలో 280 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading