Cognizant Jobs: కాగ్నిజంట్‌లో ఫ్రెషర్స్‌కి 20,000 ఉద్యోగాలు... జీతం ఏడాదికి రూ.4,00,000

Cognizant Jobs | సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోరుకునేవారికి మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. టెక్ దిగ్గజం కాగ్నిజంట్ భారతదేశంలో 20,000 మంది ఫ్రెషర్స్‌కి అవకాశం ఇవ్వనుంది.

news18-telugu
Updated: February 11, 2020, 11:09 AM IST
Cognizant Jobs: కాగ్నిజంట్‌లో ఫ్రెషర్స్‌కి 20,000 ఉద్యోగాలు... జీతం ఏడాదికి రూ.4,00,000
Cognizant Jobs: కాగ్నిజంట్‌లో ఫ్రెషర్స్‌కి 20,000 ఉద్యోగాలు... జీతం ఏడాదికి రూ.4,00,000 (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మీ కలా? బీటెక్ చదువుతున్నారా? అయితే మీకు శుభవార్త. కాగ్నిజంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ భారతదేశంలో వేల సంఖ్యలో టెక్నికల్ గ్రాడ్యుయేట్స్‌ని నియమించుకోనుంది. ఈ ఏడాది భారతదేశంలోని వేర్వేరు క్యాంపస్‌లలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించి 20,000 మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించనుందని కాగ్నిజంట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ బ్రియాన్ హంప్‌హైర్స్ తెలిపారు. అంతేకాదు... ఫ్రెషర్స్‌కి 18% వేతనం పెంచనుంది కాగ్నిజంట్. అంటే ఏడాదికి సుమారు రూ.4,00,000 వరకు వేతనం లభిస్తుంది. గతేడాది సెప్టెంబర్‌లో 10,000-12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు కాగ్నిజంట్ ప్రకటించింది. అయినా భారతదేశంలో నియామకాలు పెంచాలని కాగ్నిజంట్ ప్రణాళికలు రూపొందిస్తుండటం విశేషం.

డిజిటల్ స్కిల్స్‌తో సిద్ధంగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థులను నియమించుకోవాలని నిర్ణయించాం. 2020 సంవత్సరంలో 30% ఎక్కువగా ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్స్‌ని నియమించుకుంటాం. ఇప్పటికే 100 ప్రముఖ ఇంజనీరింగ్ క్యాంపస్‌లల్లో కాగ్నిజంట్ ఆఫర్లను అంగీకరించిన వారి సంఖ్య 80% పైనే ఉంది. ఇది కాగ్నిజంట్‌పై విశ్వాసానికి నిదర్శనం. ఇటీవల కాలంలో ఇది చాలా ఎక్కువ.
బ్రియాన్ హంప్‌హైర్స్, కాగ్నిజంట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్


గతేడాది లెక్కల ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-TCS లిమిటెడ్‌లో 4,40,000 ఉద్యోగులున్నారు. టీసీఎస్ తర్వాత 2,00,000 ఉద్యోగులతో కాగ్నిజంట్ రెండో స్థానంలో ఉంది. భారతదేశంలో స్థానిక ప్రతిభను, సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది కాగ్నిజంట్. కొద్ది రోజుల క్రితమే కర్నాటకలోని మంగళూరులో 100,000 చదరపు అడుగుల స్థలంలో కార్యాలయాన్ని ప్రారంభించింది. అక్కడ 1,100 మంది ఉద్యోగులు పనిచేస్తారు. బెంగళూరు, మైసూరులో కూడా 29,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. కాగ్నిజంట్‌కు ఎక్కువగా చెన్నైలో ఉద్యోగులున్నారు.



Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 జాబ్స్... ఫిబ్రవరి 13 లాస్ట్ డేట్ 

Railway Jobs: రైల్వేలో 570 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 1412 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్
First published: February 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు