Cognizant Jobs: కాగ్నిజెంట్ లో కొలువులే కొలువులు.. ఈ ఏడాది లక్షమందికి ఉద్యోగాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ నిరుద్యోగులకు చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది లక్ష మందిని నూతనంగా నియమించుకోనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.

  • Share this:
    కరోనా నేపథ్యంలో అనేక రంగాలు కుదేలైనా ఐటీ సంస్థలపై ఆ ప్రభావం మాత్రం అంతగా పడలేదు. దీంతో ఈ రంగంలై ఉద్యోగాల తొలగింపు ఎక్కడా కనిపించకపోగా.. నియామకాలు కూడా పెరగుతున్నాయి. అనేక కంపెనీలు కరోనా సమయంలోనూ నియామకాలు చేపట్టడం విశేషం. వర్చువల్ విధానంలో ఈ నియమకాలు సాగాయి. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ నిరుద్యోగులకు చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది లక్ష మందిని నూతనంగా నియమించుకోనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇందులో 30 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది కాగ్నిజెంట్. ఇంకా 2020లో భారత్ లో 45 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. జూన్‌ త్రైమాసికంలో అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) శాతం అత్యధికంగా 31 శాతానికి చేరడంతో కంపెనీలో నిపుణుల కొరత ఏర్పడింది.
    IT Jobs 2021: ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి 1,20,000 ఉద్యోగాలు
    TCS National Qualifier Test: ఈ ఎగ్జామ్ రాయండి... కార్పొరేట్ కంపెనీలో జాబ్‌కి ట్రై చేయండి

    ఐటీ సేవలు, బీపీఓ ఈ రెండు విభాగాల్లోనూ ఉద్యోగుల వలస అధికంగానే ఉంది. కేవలం భారత్ లోనే కాకుండా కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఇతర దేశాల్లోనూ వలసలు ఇదే మాదిరిగా ఉన్నాయి. అనేక ఛాలెంజ్ ల మధ్య ఈ కోవిడ్-19 సంక్షోభంలోనూ ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 15 శాతం ఎగిసి 4.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2015 నుండి ఇదే అత్యధిక త్రైమాసిక ఆదాయమని డిజిటల్ బిజినెస్ అండ్‌ టెక్నాలజీ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ చైర్మన్ రాజేష్ అబ్రహం వెల్లడించారు.

    దేశంలోని అతిపెద్ద డిజిటల్ చెల్లింపు పరిష్కార సంస్థ పేటీఎం దీపావళికి ముందు రూ .16,600 కోట్ల ఐపీఓను తీసుకురాబోతోంది. ఇది ఇప్పటివరకు అతిపెద్ద ఐపిఓగా భావిస్తున్నారు. ఐపిఓ తీసుకురావడానికి ముందు కంపెనీ పూర్తిగా సన్నద్ధమవుతోంది. దీని కోసం, పేటీఎం ఇప్పుడు తన ఉద్యోగుల సంఖ్యను పెంచే ఆలోచనలో ఉంది. మొబైల్ ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసే పదం పేటీఎం. మొదట వాలెట్ గా మార్కెట్లోకి వచ్చి ప్రస్తుతం పేటీఎం పేమెంట్ బ్యాంకుతో పాటు మరెన్నో సౌకర్యాలను వినియోగదారుకుల అందిస్తోంది.

    అయితే.. వీటిలో దేశవ్యాప్తంగా 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని నిర్ణయించింది. అండర్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి పేటీఎం తన ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ (ఎఫ్ఎస్ఈ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. కనీసం 18 సంవత్సరాలు నిండి.. 10, 12 లేదా గ్రాడ్యుయేట్ అయిన ఏ వ్యక్తి అయినా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: