హోమ్ /వార్తలు /jobs /

Cognizant: ఫ్రెషర్స్‌కు కాగ్నిజెంట్ గుడ్​న్యూస్​.. నెలకు రూ.21 వేల జీతం.. దరఖాస్తు ఇలా చేయండి..

Cognizant: ఫ్రెషర్స్‌కు కాగ్నిజెంట్ గుడ్​న్యూస్​.. నెలకు రూ.21 వేల జీతం.. దరఖాస్తు ఇలా చేయండి..

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఫ్రెషర్స్​కు గుడ్​న్యూస్​ చెప్పింది. ట్రైనీ ప్రోగ్రామర్ రోల్​ కోసం ఫ్రెషర్స్​ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఫ్రెషర్స్​కు గుడ్​న్యూస్​ చెప్పింది. ట్రైనీ ప్రోగ్రామర్ రోల్​ కోసం ఫ్రెషర్స్​ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఫ్రెషర్స్​కు గుడ్​న్యూస్​ చెప్పింది. ట్రైనీ ప్రోగ్రామర్ రోల్​ కోసం ఫ్రెషర్స్​ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

  ఐటీ సెక్టార్(IT Sector)​ మునుపెన్నడూ లేనంత వేగంగా దూసుకుపోతుంది. దీంతో కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నాయి. తాజాగా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) ఫ్రెషర్స్​కు గుడ్​న్యూస్​ చెప్పింది. ట్రైనీ ప్రోగ్రామర్ (Programmer trainee) రోల్​ కోసం ఫ్రెషర్స్​ (Freshers) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 2020, 2021లో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ) గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు రేపు (2022 జనవరి 6 రాత్రి 11:59)లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 2,52,000 వార్షిక వేతనం లభిస్తుంది. ఇది ఫుల్​ టైమ్​ జాబ్. కరోనా పరిస్థితికి అనుగుణంగా వర్క్​ ఫ్రమ్​ హోమ్​ లేదా వర్క్​ ఫ్రమ్​ హోమ్​ విధానంలో పనిచేసేందుకు సిద్దంగా ఉండాలి.

  Scholarships: ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం యూజీసీ నాలుగు కొత్త స్కాలర్​షిప్స్​.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలివే..

  అర్హత ప్రమాణాలు..

  దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు ఐటీ/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ టెక్నాలజీ/గణితం/ఫిజిక్స్/కెమిస్ట్రీ/స్టాటిస్టిక్స్ విభాగాల్లో బీసీఏ, బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. 2020, 2021 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే ప్రోగ్రామర్​ ట్రైనీ రోల్​ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అవకాశం లేదు. అభ్యర్థులు 10, 12 లేదా డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్‌లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. ప్రస్తుతం, ఎటువంటి స్టాండింగ్ బ్యాక్​లాగ్స్​ ఉండకూడదు. ఎడ్యుకేషన్​లో 2 సంవత్సరాల కంటే ఎక్కువ గ్యాప్ ఉన్న అభ్యర్థులు అర్హులు కాదు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలోని ఏ ప్రదేశంలోనైనా పనిచేయడానికి సిద్దంగా ఉండాలి.

  IIT Mentorship: స్కూల్ గర్ల్స్ కోసం STEM మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌.. తాజాగా ప్రారంభించిన ప్రముఖ విద్యాసంస్థ..

  రోల్స్​ అండ్​ రెస్పాన్స్​బిలిటీస్​..

  ఫంక్షనల్ రిక్వైర్​మెంట్స్​ ఆధారంగా సింపుల్​ లెవల్​ కోడింగ్​ను అభివృద్ధి చేయాలి. ఎంటిటీలు/రిలేషన్​షిప్స్​​ను అర్థం చేసుకోవాలి. డేటాబేస్‌లో సింపుల్ టేబుల్స్​ను క్రియేట్ చేయాలి. టేబుల్స్​ మధ్య సంబంధాలను వివరించాలి. డేటాబేస్ నుండి డేటాను తిరిగి పొందడానికి ప్రశ్నలను రాయాలి. CRUD (సృష్టించండి, చదవండి, నవీకరించండి, తొలగించండి) యాక్టివిటీస్​ నిర్వహించాలి. టెస్ట్​ కేసులు/స్క్రిప్ట్‌లు/డేటాను సిద్ధం చేయండి. మాన్యువల్/ఆటోమేటెడ్ టెస్ట్​లను ఎగ్జిక్యూట్​ చేయాలి. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల ప్రకారం సేవా టిక్కెట్లను సృష్టించాలి.

  కోడింగ్​ సమస్యలపై మూల కారణాన్ని విశ్లేషించాలి. ఐటీ సర్వీస్ మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్‌కు సంబంధించిన సాధనాలపై పనిచేయాలి. కొత్త ఆవిష్కరణలు, కొత్త సాంకేతికత, సాధనాలతో ప్రయోగాలు చేయడానికి సిద్దంగా ఉండాలి. స్వీయ -క్రమశిక్షణ, జవాబుదారీతనం లక్షణాలు ఉండాలి.

  First published:

  ఉత్తమ కథలు