హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IT Jobs: ఫ్రెషర్లకు శుభవార్త.. ఆ ఐటీ సంస్థలో 45 వేల ఉద్యోగాలు.. వివరాలివే

IT Jobs: ఫ్రెషర్లకు శుభవార్త.. ఆ ఐటీ సంస్థలో 45 వేల ఉద్యోగాలు.. వివరాలివే

దేశంలోని కంపెనీలు, ఎంఎన్‌సీలు FY22లో ఇప్పటివరకు దాదాపు 2,50,000 మంది ఫ్రెషర్ల నియామకాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ఫ్రెషర్‌లను నియమించుకుంటున్న టాప్ కంపెనీలలో TCS (77,000), ఇన్ఫోసిస్ (45,000), కాగ్నిజెంట్ (45,000), మరియు HCL టెక్ (22,000) ఉన్నాయి.

దేశంలోని కంపెనీలు, ఎంఎన్‌సీలు FY22లో ఇప్పటివరకు దాదాపు 2,50,000 మంది ఫ్రెషర్ల నియామకాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ఫ్రెషర్‌లను నియమించుకుంటున్న టాప్ కంపెనీలలో TCS (77,000), ఇన్ఫోసిస్ (45,000), కాగ్నిజెంట్ (45,000), మరియు HCL టెక్ (22,000) ఉన్నాయి.

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్(Cognizant) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలో 45 వేల నియామకాలను(Hiring) చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా (Corona Effect) ప్రభావం చాలా రంగాలపై అధికంగా పడినా.. ఐటీ రంగం(IT Industry)పై మాత్రం అంతగా పడలేదు. వర్క్ ఫ్రం హోం(Work From Home) విధానంతో కంపెనీ(IT Companies)లు లాభాల బాట పట్టాయి. ప్రముఖ కంపెనీలు భారీగా నియమకాలను(Recruitments) సైతం చెపట్టాయి. వర్చువల్ విధానంలో ఈ నియామకాలను ఆయా కంపెనీలు చేపట్టాయి. తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజంట్(Cognizant) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అక్టోబర్-డిసెంబర్ లో భారత్ లో 45 వేల మంది గ్రాడ్యుయేట్లను(Graduates Hiring) నియమించుకోనున్నట్లు తెలిపింది. వీరింతా 2022లో ఉద్యోగాల్లో చేరనున్నట్లు ప్రకటించింది. జూన్ త్రైమాసికంతో పోల్చితే ఉద్యోగుల సంఖ్య 17 వేలు పెరిగి మొత్తం సంఖ్య 3,18,400కు చేరింది.

ఇదిలా ఉంటే.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్(Infosys), విప్రో(Wipro), హెచ్‌సీఎల్(HCL) టెక్నాలజీస్ అనే నాలుగు దిగ్గజ ఐటీ సంస్థలు (IT Companies) ఈ ఏడాదిలో లక్ష మంది ఉద్యోగులను (Jobs) నియమించుకోవడానికి సిద్ధమయ్యాయి. ఐటీ సెక్టార్‌లో ఆకాశాన్నంటుతున్న అట్రిషన్ రేట్ల మధ్య ఉద్యోగులకు (Employees) డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 1,20,000 ఫ్రెషర్లను (Fresher Jobs) నియమించుకోవాలని ఈ నాలుగు సంస్థలు భావిస్తున్నాయి. సదరు సంస్థలు తమ త్రైమాసిక ఆదాయాల గురించి తెలియజేస్తున్న సమయంలో కొత్తగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు తెలిపాయి. టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ తమ నియామక అంచనాలను పెంచాయి.

Jobs in India: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కరోనా తర్వాత జోరుగా సాగుతున్న నియామకాలు.. ఈ రంగాల్లో అత్యధికం

2022 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో ఇప్పటికే 50,000 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే నియామకాల సంఖ్య లక్షకు పైగా (1,02,517) చేరుకుంది. ఈ నాలుగు సంస్థలు దేశం మొత్తం ఉద్యోగుల్లో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ ఉద్యోగులను కలిగి ఉన్నాయి. అయితే, ఈ ఐటీ కంపెనీల్లో వలస ఉద్యోగుల (attrition rate) రేటు గణనీయంగా పెరుగుతోంది.

Non Engineering Graduates: నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్.. మీ కోసం ఏ జాబ్స్ ఎదురుచూస్తున్నాయంటే..

దీంతో ఖాళీ అవుతున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవడానికి ఐటీ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. కొత్తగా వస్తున్న భారీ ఒప్పందాలు, మెరుగైన త్రైమాసిక ఫలితాల వల్ల ఈ ఐటీ సంస్థలు ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోగల వారికి మెంటార్‌గా ఉండగల మంచి పొజిషన్ లోనే ఉన్నాయి.

Wipro: సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విప్రో సంస్థ.. ఆ మహిళలకు ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యం

TCS:

టీసీఎస్ గత ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో 43,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను ఉద్యోగాల్లోకి తీసుకున్నట్టు ఆ కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ మిలింద్ లక్కడ్ అన్నారు. శుక్రవారం ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్న సందర్భంలో ఆయన ఉద్యోగ కల్పన గురించి పలు ప్రకటనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్థంలో మరో 35,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పిస్తామని.. తద్వారా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 78,000 మందిని నియమించుకుంటామని ప్రకటించారు.

కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ కంపెనీలో అట్రిషన్ రేటు 8.6 శాతం నుంచి 11.9 శాతంగా ఎగబాకింది. రాబోయే మూడో త్రైమాసికాల వరకు అట్రిషన్ రేటు ఇదే ట్రెండ్ లో కొనసాగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.

Infosys:

ఇన్ఫోసిస్ కూడా భారీ ఎత్తున నియామకాలు చేపట్టింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో జూన్ చివరినాటికి 13.9 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 20.1 శాతానికి పెరిగింది. అట్రిషన్ రేటు తగ్గించడానికి ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు మరోసారి జీతాలు పెంచడానికి సిద్ధమైంది. అలాగే ఈ ఏడాదిలో కాలేజ్ గ్రాడ్యుయేట్స్ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా 45 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించింది.

Wipro:

విప్రో తన రెండవ త్రైమాసిక ఆదాయాల ప్రకటన సందర్భంగా.. రెండో త్రైమాసికంలో కాలేజీ రిక్రూట్‌మెంట్ విధానాల్లో దాదాపు 8,100 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపింది. విప్రో రెట్టింపు స్థాయిలో ఫ్రెషర్ల నియామకాలు చేపట్టినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ థియరీ డెలాపోర్టే తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను తీసుకుంటామని డెలాపోర్టే ప్రకటించారు.

HCL:

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ సంవత్సరం కాలేజ్ క్యాంపస్‌ల నుంచి దాదాపు 20,000-22,000 ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది 30,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని హెచ్‌సీఎల్ యాజమాన్యం గురువారం తెలిపింది.

First published:

Tags: Career and Courses, Hcl, Information Technology, Infosys, Private Jobs, Software developer, TCS, Wipro

ఉత్తమ కథలు