హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Cochin Shipyard Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. కొచ్చిన్ షిప్ యార్డ్ లో రూ. 50 వేల వేతనంతో ఉద్యోగాలు

Cochin Shipyard Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. కొచ్చిన్ షిప్ యార్డ్ లో రూ. 50 వేల వేతనంతో ఉద్యోగాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కొచ్చిన్ షిప్ యార్డ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  కరోనా(Corona) ప్రభావం దేశంలో తగ్గడంతో దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు(Jobs) సైతం జోరందుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు(Job Notifications) విడుదల చేస్తున్నాయి. తాజాగా భారత ప్రభుత్వానికి చెందిన మినీరత్న కంపెనీ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (Cochin Shipyard Limited-CSL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 70 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో(Notification) పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు (Application) ప్రక్రియ ఈ రోజు నుంచి అంటే నవంబర్ 19 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 3ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో(Notification) స్పష్టం చేశారు.

  ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

  S.Noపోస్టుఖాళీలు
  1.సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్14
  2.ప్రాజెక్ట్ ఆఫీసర్లు56
  మొత్తం70


  అర్హతల వివరాలు:

  సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు సంబంధించిన విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 03 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి.

  వేతనం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 47 వేలు, రెండో ఏడాది నెలకు రూ. 48 వేలు, మూడో ఏడాది నెలకు రూ. 50 వేల వేతనం చెల్లిస్తారు.

  IOCL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్. ఇండియన్ ఆయిల్ లో 527 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

  ప్రాజెక్ట్ ఆఫీసర్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 03 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 37 వేలు, రెండో ఏడాది రూ. 38 వేలు, మూడో ఏడాది నెలకు రూ. 40 వేల వేతనం చెల్లించనున్నారు.

  NFL Recruitment 2021: నేషనల్ ఫెర్టిలైజర్స్ లో రూ.1.40 లక్షల వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో నాలుగు రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

  ఎలా అప్లై చేయాలంటే...

  Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://cochinshipyard.in/ ను ఓపెన్ చేయాలి.

  Step 2: అనంతరం కెరీర్ ఆప్షన్ పై క్లిక్ (https://cochinshipyard.in/Career) చేయాలి.

  Step 3: అనంతరం మీకు CSL(KOCHI) అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

  Step 4: అనంతరం S.No.1 లో ‘Click here to apply for the Post of Senior Project Officers/ Project Officers’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

  APPSC Jobs 2021: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే

  Step 5: అనంతరం రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

  Step 6: అభ్యర్థి పేరు, క్వాలిఫికేషన్, పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

  Step 7: అనతరం మీ అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలతో లాగిన్ అయి.. అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి.

  Step 8: భవిష్యత్ అవసరాలతో అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని దాచుకోవాలి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Career and Courses, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS

  ఉత్తమ కథలు