కేరళకు చెందిన కొచ్చి పోర్టు ట్రస్ట్ (Cochin Port Trust) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ సివిల్ ఇంజనీర్(Civil Engineer), సైట్ ఇంజనీర్, ఆఫీసర్ అసిస్టెంట్ (Officer Assitant), కుక్, పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు 8వతరగతి నుంచి గ్రాడ్యుయేట్ (Graduate) చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. ఈ పోస్టులకు అప్లె చేసుకోవడానికి చివరి తేది అక్టోబర్ 18, 2021 వరకు అవకాశం ఉంది. కంప్యూర్ స్కిల్స్ (Computer Skilss) ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.cochinport.gov.in/careers ను సందర్శించాలి. అర్హతలు దరఖాస్తు విధానం తెలసుకొనేందుకు చదవండి.
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు |
సీనియర్ సివిల్ ఇంజనీర్ | సివిల్ ఇంజనీరింగ్ (Engineerin)లో డిగ్రీ చేయడంతోపాటు 20 ఏళ్ల పని అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 63 ఏళ్లు మించి ఉండకూడదు | 01 |
సైట్ ఇంజనీర్ (సివిల్) | సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేయడంతోపాటు 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 55 ఏళ్లు మించి ఉండకూడదు | 01 |
సైట్ ఇంజనీర్ (ఎలక్టరికల్, మెకానికల్) | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేయడంతోపాటు 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 55 ఏళ్లు మించి ఉండకూడదు | 01 |
ఆఫీసర్ అసిస్టెంట్ | ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం (Experience) ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. గరిష్ట వయసు 45 ఏళ్లు మించి ఉండకూడదు | 01 |
ప్యూన్ కమ్ కుక్ | 8వ తరతి చదివి ఉండాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. | 01 |
NIMR Recruitment 2021: ఎన్ఐఎంఆర్లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ఎంపిక విధానం..
- ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- అప్లికేషన్ ఫాంలో అభ్యర్థులు తమ పూర్తి వివరాలు సరిగా నమోదు చేసి ఈ-మెయిల్(e-Mail) ఐడీ మొబైల్ నంబర్ దరఖాస్తులో నమోదు చేయాలి.
- అభ్యర్థుల పని అనుభవం, అకాడమిక్ అర్హతల ఆధారంగా మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం..
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.cochinport.gov.in/careers ను సందర్శించాలి.
- నోటిఫికేషన్ను పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- నోటిఫికేషన్లో అప్లికేష (Application)న్ ఫాంను ప్రింట్ తీసుకొని నింపాలి.
- అప్లికేషన్ ఫాంను
The Secretary,
Cochin Port Trust, Cochin
682 009 కు పంపాలి.
- ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS