COAL INDIA RECRUITMENT 2022 FOR 1050 MANAGEMENT TRAINEE UMG GH
Coal India Recruitment: కోల్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. గేట్- 2022 స్కోర్ ఆధారంగా ఎంపిక..!
కోల్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.
కోల్ ఇండియా (Coal India) భారీ నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ (Trainee)ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1050 ఖాళీలను భర్తీ చేయనుంది.
Coal India భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1050 ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మైనింగ్ లేదా సివిల్ లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ లేదా సిస్టమ్ అండ్ EDPకి సంబంధించి GATE- 2022లో స్కోర్ చేసి ఉండాలి. అర్హత ఉన్న అభ్యర్థులు CIL వెబ్సైట్ www.coalindia.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక GATE -2022 స్కోర్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
కోల్ ఇండియా MT రిక్రూట్మెంట్ 2022 వివరాలు..
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభ తేదీ - 23 జూన్ 2022
అప్లికేషన్ సమర్పించేందుకు చివరి తేదీ - 22 జూలై 2022
ఖాళీల వివరాలు
మేనేజ్మెంట్ ట్రైనీ - 1050
పోస్ట్ కోడ్ ఖాళీల వివరాలు
మైనింగ్ 11 699
సివిల్ 12 160
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ 13 124
సిస్టమ్ అండ్ ఈడీపీ 14 67
అర్హత ప్రమాణాలు
మైనింగ్: మైనింగ్ ఇంజనీరింగ్‌లో.. బీఈ/బీటెక్/ బీఎస్సీ(ఇంజనీరింగ్) చేసి ఉండాలి. అందులో కనీసం 60శాతం మార్కులు వచ్చి ఉండాలి.
సివిల్: సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ బీఎస్సీ(ఇంజనీరింగ్) చేసి ఉండాలి. అందులో కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలి
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్: 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ బీఎస్సీ(ఇంజనీరింగ్) చేసి ఉండాలి.
సిస్టమ్ అండ్ ఈడీపీ: కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ఐటీలో... బీఈ/ బీటెక్/ బీస్సీ(ఇంజనీరింగ్) చేసి ఉండాలి. లేదా ఎంసీఏ చేసి ఉండాలి.
వయోపరిమితి- 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులు GATE-2022 పరీక్షకు హాజరై ఉండాలి. GATE-2022 స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కోసం అభ్యర్థులను పోస్టుల వారీగా 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. GATE-2022 స్కోర్ ఆధారంగా ప్రతి పోస్ట్‌కు తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు.
దరఖాస్తు విధానం
స్టెప్-1: CIL వెబ్సైట్ www.coalindia.in ను సందర్శించాలి.
స్టెప్-2: కెరీర్ ఆప్షన్‌లోకి వెళ్లి, జాబ్ ఎట్ కోల్ ఇండియా సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్-3: అప్లికేషన్ లింక్ డిస్ప్లే అవుతుంది. దానిపై క్లిక్ చేయాలి.
స్టెప్-4: ఇప్పుడు అప్లికేషన్లో అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
స్టెప్-5: చివరిగా దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.
అప్లికేషన్ ఫీజు
జనరల్ UR/ఓబీసీ (క్రీమీ లేయర్ & నాన్-క్రీమీ లేయర్) / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. అదే ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్ఎం అభ్యర్థులు/ కోల్ ఇండియా లిమిటెడ్- దాని అనుబంధ సంస్థల ఉద్యోగులైతే రూ. 180 చెల్లించాలి.
జీతభత్యాలు
మేనేజ్మెంట్ ట్రైనీగా ఎంపికైన అభ్యర్థులకు E-2 గ్రేడ్ ప్రకారం.. పే స్కేల్ నెలకు రూ. 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. శిక్షణ కాలంలో నెలకు 50,000 జీతం ఇవ్వనున్నారు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.