Coal India Recruitment 2022 | బీటెక్, బీఈ, బీఎస్‌సీ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు పాసైనవారికి గుడ్ న్యూస్. కోల్ ఇండియా (Coal India) 1050 పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన మహారత్న కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1050 పోస్టులున్నాయి. గేట్ 2022 స్కోర్ (Gate Score Jobs) ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది కోల్ ఇండియా. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జూలై 22 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు కోల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. కోల్ ఇండియా రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Coal India Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2022 జూన్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జూలై 22
ఫీజు పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2022 జూలై 22
విద్యార్హతలు- మైనింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌తో బీఈ, బీటెక్, బీఎస్‌సీ ఇంజనీరింగ్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. సిస్టమ్, ఈడీపీ పోస్టులకు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీలో బీఈ, బీటెక్, బీఎస్‌సీ ఇంజనీరింగ్ లేదా ఎంసీఏ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. గేట్ 2022 స్కోర్ తప్పనిసరి.
వయస్సు- 2022 మే 31 నాటికి 30 ఏళ్ల లోపు.
ఎంపిక విధానం- గేట్ 2022 స్కోర్ ఆధారంగా
పరీక్ష ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,180. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
Step 4- నియమనిబంధనలన్నీ చదివి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి.
Step 5- అప్లై చేసే పోస్టు, పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 6- ఆ తర్వాత విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
Step 7- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
Step 8- ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.