హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Coal India Jobs 2021: కోల్ ఇండియాలో 361 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Coal India Jobs 2021: కోల్ ఇండియాలో 361 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Coal India Jobs 2021: కోల్ ఇండియాలో 361 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Coal India Jobs 2021: కోల్ ఇండియాలో 361 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Coal India Recruitment 2021 | కోల్ ఇండియా దేశవ్యాప్తంగా 361 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. వేర్వేరు కోల్‌ఫీల్డ్స్‌లో ఖాళీల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 361 మెడికల్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-ECL, భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్-BCCL, నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-NCL, సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-SECL, మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-MCL సంస్థల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://coalindia.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

    Coal India Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 361

    ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్- 75

    సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ లేదా మెడికల్ స్పెషలిస్ట్- 22

    సీనియర్ మెడికల్ ఆఫీసర్- 51

    సీనియర్ మెడికల్ ఆఫీసర్ (డెంటల్)- 2

    భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్- 81

    సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ లేదా మెడికల్ స్పెషలిస్ట్- 36

    సీనియర్ మెడికల్ ఆఫీసర్- 42

    సీనియర్ మెడికల్ ఆఫీసర్ (డెంటల్)- 3

    SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    Prasar Bharati Recruitment 2021: దూరదర్శన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్- 49

    సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ లేదా మెడికల్ స్పెషలిస్ట్- 20

    సీనియర్ మెడికల్ ఆఫీసర్- 28

    సీనియర్ మెడికల్ ఆఫీసర్ (డెంటల్)- 1

    సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్- 86

    సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ లేదా మెడికల్ స్పెషలిస్ట్- 52

    సీనియర్ మెడికల్ ఆఫీసర్- 32

    సీనియర్ మెడికల్ ఆఫీసర్ (డెంటల్)- 2

    మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్- 70

    సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ లేదా మెడికల్ స్పెషలిస్ట్- 40

    సీనియర్ మెడికల్ ఆఫీసర్- 28

    సీనియర్ మెడికల్ ఆఫీసర్ (డెంటల్)- 2

    TIMS Recruitment 2021: గచ్చిబౌలిలోని టిమ్స్‌లో 199 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    DSSSB Teacher Recruitment 2021: గుడ్ న్యూస్... 12,065 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

    Coal India Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 30

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

    దరఖాస్తు విధానం- కోల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ https://coalindia.in/ లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి.

    ఎంపిక విధానం- ఇంటర్వ్యూ.

    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs

    ఉత్తమ కథలు