అసలే కరోనా కష్టకాలం. అన్ని రంగాలు సంక్షోభాల్లో ఉన్నాయి. ఉద్యోగాల కోత తప్పట్లేదు. వేతనాల కోత కూడా తప్పట్లేదు. ఇలాంటి సమయంలో కొత్త ఉద్యోగావకాశాల గురించి ఆలోచించే పరిస్థితే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన బొగ్గు తవ్వకాలు, రిఫైనరీ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఈ ఏడాది కొత్తగా 6,600 మంది ఉద్యోగుల్ని చేర్చుకోనుంది. ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ కేడర్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గత ఏడాది ఇవే కేటగిరీల్లో 8,000 ఉద్యోగుల్ని చేర్చుకుంది కోల్ ఇండియా. ఈసారి 6,600 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇదే విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి ట్విట్టర్లో వెల్లడించారు.
లాక్డౌన్ కారణంగా కోల్ ఇండియా, సబ్సిడరీ కంపెనీల్లో నియామక ప్రక్రియలో జాప్యం నెలకొంది. ఒక్కసారి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటే భారీగా ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఈ ఏడాది ఎక్కువ మంది ఉద్యోగుల్ని నియమించుకోబోతున్నాం. ఈ ఏడాది అన్ని సబ్సిడరీ కంపెనీల్లో 1,000 వర్క్‌మెన్ పోస్టుల్ని భర్తీ చేస్తాం.
కోల్ ఇండియాలో 1,326 ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి ఇప్పటికే రాతపరీక్ష పూర్తైంది. కానీ లాక్డౌన్ కారణంగా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. లాక్డౌన్ ఎత్తేసిన కొన్ని వారాల్లోనే ఇంటర్వ్యూలు పూర్తవుతాయి. మైనింగ్ సమయంలో ఉద్యోగులు ప్రమాదాల బారినపడుతున్నందున 400 మంది డాక్టర్లను కూడా నియమించుకోనుంది కోల్ ఇండియా. కొత్త ప్రాజెక్టులకు భూసేకరణ వల్ల ఆశ్రయం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి 500-600 ఉద్యోగాలను ఇస్తోంది కంపెనీ.
భారతీయ రైల్వే తర్వాత కోల్ ఇండియా ఎక్కువ ఉద్యోగులు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. కోల్ ఇండియాలో 2.8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 19,000 మంది ఎగ్జిక్యూటీవ్స్. మిగతా వారు నాన్-ఎగ్జిక్యూటీవ్, వర్క్‌మెన్ పోస్టులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.