Home /News /jobs /

COAL INDIA LIMITED TO FILL 9000 EXECUTIVE AND NON EXECUTIVE POSTS SOON SAYS REPORT SS

Coal India Jobs: త్వరలో కోల్ ఇండియాలో 9000 ఉద్యోగాల భర్తీ...

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Coal India Limited Jobs | కోల్ ఇండియా లిమిటెడ్‌తో పాటు దాని 8 అనుబంధ సంస్థలు నేరుగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నాయి. ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని కోల్ ఇండియా లిమిటెడ్ భర్తీ చేయనుండగా, ఇతర టెక్నికల్ ఉద్యోగాలు, కార్మికులను అనుబంధ సంస్థలు భర్తీ చేస్తాయి.

ఇంకా చదవండి ...
    ఓవైపు ఆర్థిక మాంద్యం ఛాయలు... మరోవైపు నిరుద్యోగం... ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలపై నిరుద్యోగులకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. కానీ నిరుద్యోగులు త్వరలో శుభవార్త అందనుంది. కోల్ ఇండియా లిమిటెడ్ త్వరలో 9000 ఎగ్జిక్యూటీవ్, నాన్-ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేయనుందని ఎకనమిక్ టైమ్స్ కథనం. కోల్ ఇండియా నుంచి గత దశాబ్దకాలంలో ఇదే అతిపెద్ద రిక్రూట్‌మెంట్ కానుందని, కాంపిటీటీవ్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ, అంతర్గత నియామకాల ద్వారా 9000 ఉద్యోగాలను భర్తీ చేయనుందని ఆ వార్తా కథనం సారాంశం. కోల్ ఇండియా లిమిటెడ్‌తో పాటు దాని 8 అనుబంధ సంస్థలు నేరుగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నాయి. ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని కోల్ ఇండియా లిమిటెడ్ భర్తీ చేయనుండగా, ఇతర టెక్నికల్ ఉద్యోగాలు, కార్మికులను అనుబంధ సంస్థలు భర్తీ చేస్తాయి. గతేడాది కేవలం 1,200 మందిని నియమించుకున్నామని, చాలావరకు ఖాళీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఒక్క ఏడాదిలో భర్తీ చేస్తామని కోల్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారి వెల్లడించినట్టు ఆ కథనంలో వెల్లడించింది ఎకనమిక్ టైమ్స్.

    కోల్ ఇండియా లిమిటెడ్‌లో 9000 ఖాళీల్లో 4000 పోస్టులు ఎగ్జిక్యూటీవ్ కేడర్ కాగా వాటిలో 900 పోస్టుల్ని అడ్వర్‌టైజ్‌మెంట్, ఇంటర్వ్యూ ద్వారా, 2200 పోస్టుల్ని పోటీ పరీక్షల ద్వారా, 400 పోస్టుల్ని క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా, మిగతా పోస్టుల్ని వేర్వేరు పద్ధతుల్లో భర్తీ చేస్తుంది. ఇక 5000 నాన్-ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్లో 2300 పోస్టుల్ని పలు ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన కుటుంబాలకు చెందిన వారికి కేటాయించనుంది. 2350 పోస్టుల్ని రిటైర్‌కు ముందే చనిపోయినవారికి కేటాయిస్తుంది. భారతీయ రైల్వే తర్వాత కోల్ ఇండియా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. సుమారు 280,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 18,000 మంది ఎగ్జిక్యూటీవ్ సిబ్బంది.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

    Bank Clerk Jobs: దేశవ్యాప్తంగా 12,074 క్లర్క్ పోస్టులు... తెలుగు రాష్ట్రాల్లో 1389 ఖాళీల వివరాలివే

    LIC Jobs: ఎల్ఐసీలో 8500 అసిస్టెంట్ ఉద్యోగాలకు సిలబస్ ఇదే...
    First published:

    Tags: CAREER, Coal India Limited, EMPLOYMENT, Exams, JOBS, NOTIFICATION

    తదుపరి వార్తలు