తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) గుడ్న్యూస్ చెప్పింది. ఏళ్లుగా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువత కోసం సీఎం కేసీఆర్ (CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్ల (Study Circles)ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, గ్రూప్–1 వంటి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చేందుకు ‘ఆలిండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. నాలుగు వర్గాలకు 4 ఆలిండియా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
హైదరాబాద్లోని (Hyderabad) ప్రగతిభవన్‌లో బడుగు, బలహీనవర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా వర్గాల విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం (Coaching for competitive exams), ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), మైనార్టీ (Minority) స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగం, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్..
తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో (National level) విడుదలయ్యే ఉద్యోగాల నోటిఫికేషన్లను (JOB Notifications) స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉంచాలని, అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. చదువుకు తగ్గ ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని మార్గదర్శకత్వాన్ని అందించే కేంద్రాలుగా స్టడీ సర్కిళ్ల (Study circles)ను తీర్చిదిద్దాలని ఆయన కోరారు ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
ఎంప్లాయ్‌మెంట్ అవెన్యూలుగా కేంద్రాలు..
సీఎం కేసీఆర్ అధికారులకు సూచనలిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో విజయావకాశాలను సాధించిపెట్టే అస్త్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న స్టడీ సరిళ్లు రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. స్టడీ సర్కిళ్లు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ కేంద్రాలుగా మారాలని అన్నారు . ఎంప్లాయ్‌మెంట్ అవెన్యూలుగా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు కేసీఆర్ . కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అందివచ్చే ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధంగా యువతను తీర్చిదిద్దాలని సీఎం కోరారు.
స్టడీ సరిళ్లలో భోజన వసతులు..
ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్ ఎలా ఉండాలో విధివిధానాలను అధికారులు రూపొందించాలని సీఎం తెలిపారు. ఇందుకు సమర్ధవంతులైన అధికారులను నియమించాలని ఆదేశించారు సీఎం. ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులనుపూర్తిచేసుకున్న తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సరిళ్లు పోషించాలని ఆకాంక్షించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్ రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలని తెలిపారు. శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సరిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి స్టడీ సరిల్‌లో కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలి. ఆయా జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధివిధానాలు రూపొందించాలి. బాలురకు కల్పించినట్టుగానే బాలికలకు కూడా స్టడీ సరిళ్లల్లో ప్రత్యేక వసతిని ఏర్పాటు చేయాలని చెప్పారు సీఎం కేసీఆర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bc study circle, CM KCR, Free coaching, JOBS, Jobs in telangana, Telangana