హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CM KCR: సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. లక్ష్య సాధనకు ముందుకు సాగాలని యువతకు పిలుపు

CM KCR: సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. లక్ష్య సాధనకు ముందుకు సాగాలని యువతకు పిలుపు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

నూతన సంవత్సరం (2023) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (Telangana CM KCR) రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నూతన సంవత్సరం (New Year 2023) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (Telangana CM KCR) రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు. గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని యువత తమ ఆశయ సాధనకై ముందుకు సాగాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. జీవితం పట్ల సరైన దృక్పథం, సంకల్ప బలం ఉంటేనే లక్ష్య సాధనలో సఫలీకృతులమవుతారని సీఎం పునరుద్ఘాటించారు. 

ఎన్నో అవాంతరాలు, సమస్యలు, వివక్షను ఎదుర్కొంటూ నేడు భారత దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అందరికీ ఆదర్శమని సీఎం స్పష్టం చేశారు. అనతికాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్ గా మారిందని తెలిపారు. 2023 నూతన సంవత్సరం తెలంగాణతో పాటు దేశ ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలన్నారు.

దేశంలో సరికొత్త ప్రజా రాజకీయాలకు, పాలనకు నాందిగా నూతన సంవత్సరం నిలవాలని సీఎం ఆకాంక్షించారు. 2023 సంవత్సరంలో సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు మరింత సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఎం సూచించారు.

First published:

Tags: CM KCR, JOBS, Telangana government jobs

ఉత్తమ కథలు