హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Ukraine Students: ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలంగాాణ స్టూడెంట్స్ కు అండగా కేసీఆర్ సర్కార్.. శంషాబాద్ వరకు ఫ్రీ

Telangana Ukraine Students: ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలంగాాణ స్టూడెంట్స్ కు అండగా కేసీఆర్ సర్కార్.. శంషాబాద్ వరకు ఫ్రీ

ఉక్రెయిన్ నుంచి దేశానికి తిరిగి వస్తున్న విద్యార్థులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉక్రెయిన్ నుంచి దేశానికి తిరిగి వస్తున్న విద్యార్థులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉక్రెయిన్ నుంచి దేశానికి తిరిగి వస్తున్న విద్యార్థులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఉక్రెయిన్(Ukrain) నుండి ఇండియాకు వస్తున్న తెలంగాణ విద్యార్థులకు(Telangana Students) కేసీఆర్(KCR) సర్కార్ అండగా నిలిచింది. వారిని ఫ్రీగా హైదరాబాద్(Hyderabad) కు రావాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎస్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఇప్పటికే ముంబై చేరుకుందని తెలిపారు. మరో ఫ్లైట్ ఈ అర్ధరాత్రి 2 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకుంటున్నదని సోమేశ్ కుమార్ వివరించారు. అక్కడి నుంచి తెలంగాణ విద్యార్థులను హైదరాబాద్ కు చేరవేయడానికి ప్రభుత్వం ఉచితంగా టికెట్లను అందించనుందని వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాట్లను చేసిందని తెలిపారు. ఈ విద్యార్థులు ప్రత్యేక ఫ్లయిట్ ద్వారా రేపు ఉదయం బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారని వివరించారు. ఉక్రెయిన్ నుండి వచ్చే తెలంగాణ విద్యార్థినీ విద్యార్థులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను న్యూఢిల్లీ, హైదరాబాద్ లలో చేసినట్లు సీఎస్ చెప్పారు. ఇప్పటికే న్యూ ఢిల్లీ తెలంగాణ భవన్, హైదరాబాద్ లోని సెక్రెటేరియేట్ లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ గుర్తు చేశారు.

  ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. ‘ఆపరేషన్ గంగా’ పేరుతో ఉక్రెయిన్ లోని భారతీయుల తరలింపును సర్కారు ముమ్మరం చేసింది. అందులో భాగంగా.. ఉక్రెయిన్‌ యుద్దం నేపథ్యంలో రొమేనియా నుంచి 219 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్​ ఇండియా తొలి విమానం ముంబయికి చేరుకుంది. కేంద్ర మంత్రి పీయుష్​ గోయల్ ముంబై ఎయిర్ పోర్టులో విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రేయిన్​ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఉక్రేయిన్​లో చిక్కుకున్న ఇతర భారతీయులకు కూడా ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. సురక్షితంగా భారత్​కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

  Ukraine Russia war: రష్యా‌‌-ఉక్రెయిన్​ వార్​ ఎఫెక్ట్​.. ఉక్రెయిన్​లో చిక్కుకున్న కరీంనగర్​ వాసులు.. రహదారులన్నీ మూసివేత​

  ఉక్రెయిన్​ నుంచి వచ్చిన భారతీయులకు కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ ముంబయి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. వెల్​కమ్​ బ్యాక్​ టు మదర్​ ల్యాండ్​ అంటూ ట్వీట్​ చేశారు. ఉక్రెయిన్​ నుంచి సురక్షితంగా బయటపడి ముబయి విమానాశ్రయానికి చేరుకున్న భారతీయుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం ప్రతి భారతీయుడి భద్రత కోసం అవిశ్రాంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.


  Ukraine: మెడిసిన్ చదవడం కోసం ఉక్రెయిన్‌కు ఎందుకు వెళ్తారు? కారణాలు ఇవే

  మరో 250 మంది భారతీయులతో రెండో బ్యాచ్​ త్వరలోనే ఢిల్లీ చేరుకుంటుందని మంత్రి గోయల్ తెలిపారు. రొమేనియా రాజధాని నగరం బుకారెస్ట్‌ నుంచి భారత్‌కు శనివారం మధ్యాహ్నం 1.55 గంటలకు ఈ విమానం బయలుదేరింది. ఆ దేశ సహకారంతో ఉక్రేయిన్​లో చిక్కుకున్న మిగతా వారిని కూడా స్వదేశానికి సురక్షితంగా చేర్చేలా కేంద్రం కృషి చేస్తోంది. 16వేల మందికిపైగా భారతీయులు ఉక్రేయిన్​లో చిక్కుకున్నారు.

  First published:

  Tags: Career and Courses, Russia-Ukraine War, Telangana students

  ఉత్తమ కథలు