Home /News /jobs /

CM KCR ANNOUNCED IN THE ASSEMBLY THAT JUNIOR PANCHAYAT SECRETARIES WOULD BE PAID SALARIES EQUAL TO PERMANENT EMPLOYEES NS

CM KCR: పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్.. ఇక వారితో సమానంగా వేతనలు

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. వారికి రెగ్యులర్ కార్యదర్శులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు

    తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి రెగ్యులర్ కార్యదర్శులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. అయితే వారి ప్రొహిబిషన్ పిరియడ్ మాత్రం మారో ఏడాది పెంచుతున్నామన్నారు. అయితే గ్రామంలో మెక్కలు పెంచడం, ఇతర పనులు మంచిగా జరగడమే తమ లక్ష్యమన్నారు.  అంతే కాని వారిని వేధించానలన్నది తమ భావన కాదన్నారు. ఈ నేపథ్యంలో కార్యదర్శులకు పలు నిబంధనలు విధించామన్నారు. నిబంధనల కారణంగానే గ్రామాల్లో మొక్కల పెంపు కార్యక్రమం ఆశించిన ప్రయోజనాన్ని ఇచ్చిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సైతం త్వరలో వేతనాలు పెంచుతామని తెలిపారు.



    పర్మినెంట్ వారితో పాటు తాత్కాలిక ఉద్యోగులకు సైతం వేతనాలు పెంచిన ఘనత తెలంగాణ సర్కార్ కే  దక్కుతుందన్నారు. ఈ మేరకు సీఎం అసెంబ్లీలో ఈ రోజు ప్రకటన చేశారు. ఒకప్పుడు వీఆర్ఏ లకు రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు మాత్రమే ఉండేదన్నారు. ఇప్పుడు వారికి రూ. 14 వేల వరకు వేతనాలు అందిస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిని లేకుండా చేయడమే లక్ష్యంగా ధరణి వెబ్ సైట్ ను తీసుకువచ్చామన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CM KCR, Telangana Assembly

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు