హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Skills: ఆ నైపుణ్యాలున్న వారికే ఇండియాలో డిమాండ్‌.. ఉద్యోగం తొందరగా వస్తుంది!

Job Skills: ఆ నైపుణ్యాలున్న వారికే ఇండియాలో డిమాండ్‌.. ఉద్యోగం తొందరగా వస్తుంది!

Job Skills: ఆ నైపుణ్యాలున్న వారికే ఇండియాలో డిమాండ్‌.. ఉద్యోగం తొందరగా వస్తుంది!

Job Skills: ఆ నైపుణ్యాలున్న వారికే ఇండియాలో డిమాండ్‌.. ఉద్యోగం తొందరగా వస్తుంది!

Job Skills: మారుతున్న టెక్నాలజీ (Technology)తో ప్రపంచమంతా వ్యాపార అవకాశాలు పెరిగాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా తమ బిజినెస్‌ (Business) సేవలు అందించవచ్చు. దీంతో 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌.. అభివృద్ధి చెందిన దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మారుతున్న టెక్నాలజీ (Technology)తో ప్రపంచమంతా వ్యాపార అవకాశాలు పెరిగాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా తమ బిజినెస్‌ (Business) సేవలు అందించవచ్చు. దీంతో 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌.. అభివృద్ధి చెందిన దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అటు మార్కెట్‌ పరంగాను, ఇటు మానవ సేవల పరంగాను కీలకంగా మారింది. ఈ కారణంగానే భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగం చాలా వేగంగా వృద్ధి చెందింది. ఇదే క్రమంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా అనాలసిస్‌కు ఇండియాలో విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఈ విషయంపై ఎడ్యుటెక్ ప్లాట్‌ఫాం ఉడెమీ చేసిన సర్వేకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో క్లయింట్‌ స్టోర్‌ చేసిన డేటా మొత్తం ఒక వెబ్‌ సర్వర్‌లో స్టోర్‌ చేసి ఉంటుంది. క్లయింట్‌కు అవసరమైన సమయంలో వాటిని అందిస్తారు. అప్లికేషన్లు మొదలుకుని సాఫ్ట్‌వేర్‌ వరకు ఈ సేవలు లభ్యమవుతాయి. విస్తృతమైన సమాచారాన్ని విశ్లేషించి కంపెనీ వ్యాపారానికి అవసరమైన నిర్ణయాలు ఇవ్వడం డేటా అనాలసిస్‌ కింద వస్తుంది. ఇండియాలో 2023 ఏడాదికి గాను ఈ రెండు రంగాలు 27% వృద్ధిని సాధించనున్నట్లు ఉడెమీ సంస్థ తన సర్వే నివేదికలో పేర్కొంది.

* పెరగనున్న పెట్టుబడులు

ఈ రెండింట్లో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌ సంస్థలు 2026 నాటికి తమ ఖర్చులో 45% వీటిపైనే ఖర్చు చేయనున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. టెక్నికల్‌ అంశాలకు సంబంధించి డేటా అనాలసిస్‌ నైపుణ్యాలు, సెక్యూరిటీ అండ్‌ సొల్యూషన్స్‌ విభాగాలకు 2161% ప్రాధాన్యం పెరిగి టాప్‌ ప్లేస్‌లో ఉంటుంది. 1012%తో సిస్టం డిజైన్‌, 643%తో 5జీ టెక్నాలజీ ఉంటాయి.

* నైపుణ్యాలు పెంచుకోవాలి

ఇండియాలో జాబ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్టుగానే ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని ఉడెమీ నివేదిక చెబుతోంది. రాబోయే అయిదేళ్లల్లో 40% మంది ఉద్యోగులు తమ స్కిల్స్‌ పెంచుకోవాలి. 60% మంది మార్కెట్‌ అవసరాలకు తగ్గట్లుగా నైపుణ్యాలు పెంచుకోవాలి. మార్కెట్‌ అవసరాలకు తగ్గట్లుగా ఉద్యోగుల స్కిల్స్‌ పెంచడంలో టీం లీడర్లు, మేనేజర్లు కీలకంగా వ్యవహరించాలని ఉడెమీ ఇండియా, సౌత్‌ ఏసియా కంట్రీ మేనేజర్‌ వినయ్‌ ప్రదాన్‌ సూచించారు. వ్యాపార వృద్ధి కోసం సెల్ఫ్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫారమ్స్‌ మీద సమయం, డబ్బు వెచ్చించాలని అన్నారు. అదే విధంగా ఉద్యోగుల్లో టెక్నికల్‌ స్కిల్స్‌ కూడా పెంచాలన్నారు.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్ అర్హతతో ఈ పోస్టాఫీస్ జాబ్స్ కు అప్లై చేశారా?

* డిజిటల్‌ రంగంలో రాణించాలంటే

డిజిటల్‌ రంగంలో రాణించడానికి వ్యాపార, వ్యక్తిగత, సాంకేతిక నైపుణ్యాలు కీలకమని వినయ్‌ ప్రదాన్‌ సూచించారు. చాలామంది క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా అనాలసిస్‌ల ప్రాముఖ్యాన్ని గుర్తించి అందులో శిక్షణ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారని ఆయన వివరించారు. ప్రొడక్షన్‌ పెరగడానికి ఇవి ఉపయోగపడతాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సర్టిఫికేషన్, జావా, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, పైథాన్‌, సెలీనియం వెబ్‌డ్రైవర్ స్కిల్స్‌ 2023 ఏడాదికిగాను ఇండియాలో అవసరమయ్యే నైపుణ్యాలలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాయి.

First published:

Tags: CAREER, Career and Courses, Cloud computing, EDUCATION, JOBS

ఉత్తమ కథలు