దేశంలో పరీక్షల సీజన్ (Exams Season) దాదాపుగా మొదలైంది. వివిధ రకాల ప్రవేశ పరీక్షలకు ఆయా బోర్డులు ప్రక్రియ ప్రారంభిస్తున్నాయి. సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు. చాలా మంది ఎంత కష్టపడి చదివినా పరీక్ష సమయంలో ఆందోళనతో సరిగ్గా రాయలేకపోతారు. అయితే ఈ పరిస్థితులను అధిగమించి మంచి మార్కులు సాధించాలంటే ప్రణాళిక, క్రమశిక్షణ అవసరమని నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT) 2023 ఎంట్రెన్స్ ఎగ్జామ్ మొదలుకానుంది. ఈ నేషనల్ లెవెల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో మంచి మార్కులు సాధించేందుకు నిపుణులు అందిస్తున్న టిప్స్ ఇవే..
* CLAT ఎగ్జామ్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 22 లా యూనివర్సిటీలలో అడ్మిషన్ కల్పిస్తారు. ప్రైవేట్ లా స్కూల్స్ కూడా CLAT స్కోరు ఆధారంగా అడ్మిషన్స్ తీసుకుంటాయి. ఇండియాలోని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ONGC, Coal India, BHEL, Steel Authority Of India, Oil India తదితర కంపెనీలు లీగల్ పొజిషన్ రిక్రూట్‌మెంట్ కూడా CLAT స్కోర్ ఆధారంగానే నిర్ణయిస్తాయి.
* ముఖ్యమైన టాపిక్స్
ఎగ్జామ్ సమీపిస్తున్న కొద్దీ.. ఎగ్జామ్ ఎలా రాయాలి అనేదానిపై కొన్ని స్ట్రాటజీలు అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని నెలలుగా చేస్తున్న ప్రాక్టీస్‌ని అంచనా వేయడం ముఖ్యం. CLAT ఎగ్జామ్‌లో ముఖ్యంగా టైం మేనేజ్‌మెంట్ చాలా కీలకం. అభ్యర్థి ప్రతి సెక్షన్ నుంచి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలని భావిస్తాడు.. అయితే ప్రతి సెక్షన్‌లోనూ ఈజీ నుంచి డిఫికల్టీ లెవల్ వరకు ప్రశ్నలు ఉంటాయని గుర్తించాలి.
CLATలో 50 శాతం ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్, లీగల్ రీజనింగ్ టాపిక్స్ నుంచి వస్తాయి. 80 నుంచి 90 మార్కులు స్కోర్ చేయాలనుకునే అభ్యర్థికి లీగల్ రీజనింగ్ విభాగం చాలా ప్రధానం. ఈ రెండు టాపిక్స్‌పై దృష్టి పెడితే ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.
* చివరి నిమిషాల్లో కొత్తవి చదవొద్దు
ఎగ్జామ్ టైం దగ్గర పడుతున్నప్పుడు కొత్త టాపిక్స్ చదవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఏదో మిస్ అవుతున్నాం అన్న భావనతో కొత్త కొత్త టాపిక్స్ చదవడానికి ప్రయత్నించకూడదు. కష్టమైన టాపిక్స్‌ను చదవడానికి ప్రయత్నించి ఒత్తిడికి గురవకూడదు. వీలైనంత వరకు చదివిన అంశాలను రివైజ్ చేయాలి. పరీక్షకు ముందు ముఖ్యమైన అంశాలను తప్పక రివిజన్ చేయాలి.
* మాక్‌టెస్ట్‌లు అవసరం
ఏ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా.. మాక్‌టెస్ట్‌లు రాయడం చాలా అవసరం. CLAT ఎగ్జామ్ విషయానికి వస్తే 2020లో ఎగ్జామ్ పేపర్ రివైజ్ చేశారు కాబట్టి, కొన్ని ప్రీవియస్ పేపర్స్ మాత్రమే ఉన్నాయి. మాక్‌టెస్ట్‌లో ఇంపార్టెంట్ ఈవెంట్లను, లీగల్ ఇన్ఫర్మేషన్‌ను కవర్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. లాస్ట్ మూమెంట్ రివిజన్‌కి మాక్‌టెస్ట్‌లు ఉపయోగపడతాయి. ఏ అంశాలలో వెనకబడ్డారు, టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా ఉందనే అంశాలపై స్పష్టత వస్తుంది.
ఇది కూడా చదవండి : ఎక్స్‌ట్రా అటెంప్ట్ ఇవ్వాలని సివిల్స్ అభ్యర్థుల డిమాండ్.. ఎందుకంటే?
* సొంత అభిప్రాయాలు పక్కన పెట్టాలి
ఎగ్జామ్ పేపర్‌లో GK సెక్షన్‌లో క్వశ్చన్‌పై దృష్టి సారించడం ముఖ్యం. ఈ సెక్షన్‌లో ఉండే ప్యాసేజ్ మొత్తం చదవనవసరం లేకుండా క్వశ్చన్ పై దృష్టి సారిస్తే సమయం ఆదా అవుతుంది. మిగతా సెక్షన్స్ పై దృష్టి సారించవచ్చు. ఒకవేళ ప్యాసేజ్‌లో కన్ఫ్యూజన్ ఉంటే కాంటెక్స్ట్ ఉన్న పేరా మాత్రం రిఫర్ చేయాలి.
లీగల్ రీజనింగ్ సెక్షన్‌లో మాత్రం దీనికి రివర్స్ ఫాలో అవ్వాలి. ప్యాసేజ్‌లో స్పష్టంగా ఉన్న సమాధానాలు మాత్రమే రాయాలి. సొంత అభిప్రాయాలు పక్కనపెట్టి.. ఆథర్ దృష్టిలో ఆలోచించాలి. లీగల్ రీజనింగ్ సెక్షన్లో అవసరం లేని అర్థం లేని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వాటిపట్ల జాగ్రత్త వహించాలి. CLAT ఎగ్జామ్లో ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్ ప్రకారం సిలబస్‌ను రెండు సెక్షన్‌లలో కవర్ చేసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Clat admit cards, EDUCATION, Exam Tips, JOBS