CLASS XII MARKS ADMISSION CRITERIA RELAXED NITS BN
విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
జేఈఈ మెయిన్స్ 2020లో అర్హత సాధించిన విద్యార్థులు12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన సరిపోతుందంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా భావించే నిట్, ఇతర టెక్నికల్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన అర్హత నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆయా టెక్నికల్ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందాలంటే.. కనీస అర్హతగా 12వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 75 శాతం మార్కులు పొంది ఉండాలి. అయితే తాజాగా కేంద్రం ఈ నిర్ణయం సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో పలు బోర్డులు పరీక్షలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు గురువారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం 12వ తరగతిలో 75 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది.
అందులో భాగంగానే జేఈఈ మెయిన్స్ 2020లో అర్హత సాధించిన విద్యార్థులు12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన సరిపోతుందంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఇప్పటిదాకా నిట్‌తో పాటు ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులు కావడంతో పాటు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 75 మార్కులు లేదా అర్హత పరీక్షలో టాప్ 20 పర్సంటైల్ ర్యాంకును సాధించాల్సి ఉంది. ఇదిలావుంటే.. జేఈఈ మెయిన్స్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.