కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 31 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(Excellence) కేంద్రాలను త్వరలో ప్రారంభించనుంది. ముందుగా బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సెంటర్లలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు సివిల్ సర్వీసెస్(Civil Services) పరీక్షల కోసం ఉచిత కోచింగ్(Free Coaching) ఇవ్వనున్నారు. వీటిలో కోచింగ్ తీసుకోవాలంటే విద్యార్థులు ముందుగా ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణత సాధిస్తే కోచింగ్ తీసుకోవడానికి అర్హత సాధిస్తారు. ఒక్కో కేంద్రంలో కోచింగ్ కోసం 100 సీట్లు కేటాయిస్తారు. మొత్తం మంజూరైన సీట్లలో 33 శాతం SC కేటగిరీకి చెందిన అర్హులైన మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కో కేంద్రంలో ముగ్గురు అధ్యాపకులను నియమిస్తారు. ప్రత్యేక తరగతి గదులు, లైబ్రరీ, హై-స్పీడ్ వై-ఫై కనెక్టివిటీ, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం కోచింగ్ కేంద్రాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.
Jobs in Telangana: కేంద్ర సంస్థలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ఏప్రిల్ 22న డాక్టర్ అంబేద్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జాతీయ ప్రారంభోత్సవానికి BHU ఆతిథ్యం ఇవ్వనుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, BHU వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ సుధీర్ K జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
దేశంలోని 31 సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రతిపాదిత కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బనారస్ హిందూ యూనివర్సిటీ ఒకటి. ఈ ప్రారంభ కార్యక్రమం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌లోని శతాబ్ది కృషి ప్రేక్షగృహ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో మిగిలిన యూనివర్సిటీల వైస్ ఛాన్సులర్లు పాల్గొననున్నారు. ఈ కేంద్రాల ఏర్పాటు కోసం అంబేడ్కర్ ఫౌండేషన్.... పర్యవేక్షించే యూనివర్సిటీలతో రెండు అవగాహన ఒప్పందాలు కుదర్చుకోనుంది. బనారస్ హిందూ యూనివర్సిటీలో ఈ కేంద్రం ప్రారంభ కార్యక్రమానికి నోడల్ అధికారిగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ R. N. ఖార్వార్ ఎంపికయ్యారు.
జామియా మిలియా ఇస్లామియా (JMI), అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU)తో సహా అనేక యూనివర్సిటీలు ఇప్పటికే మత, సామాజిక, ఆర్థికంగా మైనారిటీల పరిధిలోకి వచ్చే ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్‌ను అందిస్తున్నాయి. ప్రతి ఏటా ఈ కేంద్రాలు టాపర్‌లను అందిస్తూ వస్తున్నాయి. ముస్లిం మతం నుండి ఎక్కువ మంది విద్యార్థులను UPSC సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చే విధంగా 'UPSC జిహాద్' కృషి చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే ఇందులో ఎటువంటి నిజం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
TSPSC Group 1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఇంటర్వ్యూల రద్దు నేపథ్యంలో కీలక మార్పు!
అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం UPSC సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ను అందిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ abhyuday.up.gov.inలో కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ ఇవ్వడానికి 500 మంది IAS అధికారులు, 450 మందికి పైగా IPS అధికారులు, 300 మందికి పైగా IFS అధికారులతోపాటు వివిధ విభాగాల్లో నిపుణులను నియమించుకున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ప్రత్యక్ష తరగతులతోపాటు వర్చువల్ మాధ్యమాల ద్వారా సంబంధిత రంగాలలో ఔత్సాహికులకు శిక్షణను అందిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Civils, Free coaching