సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 451 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కానిస్టేబుల్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.cisfrectt.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
S.No. | పోస్టు | ఖాళీలు |
1. | కానిస్టేబుల్/డ్రైవర్ | 183 |
2. | కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ | 268 |
మొత్తం: | 451 |
విద్యార్హతల వివరాలు:
అభ్యర్థులు టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు ఫిబ్రవరి 22 నాటికి 21-27 ఏళ్లు ఉండాలి. ఇంకా.. హెవీ మోటార్ వెహికల్/ట్రాన్స్‌పోర్ట్ వెహికల్/లైట్ మోటార్ వెహికల్/మోటార్ సైకిల్ విత్ గేర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఉండాలి. మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో వెల్లడించారు.
SSC Recruitment 2023: టెన్త్ అర్హతతో 11,409 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ... అప్లై చేయండిలా
దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/EWS అభ్యర్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.
అప్లికేషన్ లింక్: https://www.cisfrectt.in/
ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank Of Maharashtra) సైతం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 225 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే అంటే జనవరి 23న ప్రారంభం కాగా.. దరఖాస్తు (Bank Jobs Application) చేసుకోవడానికి ఫిబ్రవరి 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, JOBS, Police jobs