హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CISF Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పదో తరగతి అర్హతతో పోలీస్ ఉద్యోగాలు

CISF Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పదో తరగతి అర్హతతో పోలీస్ ఉద్యోగాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CISF Recruitment: పోలీస్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర రక్షణ బలగాల్లో ఒకటైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF).. పదో తరగతి అర్హతతో పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పోలీస్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర రక్షణ బలగాల్లో ఒకటైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF).. పదో తరగతి అర్హతతో పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే స్టేట్ రిక్రూట్‌మెంట్ బోర్డులు కానిస్టేబుల్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించగా, అందులో క్వాలిఫై కాని వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

* ఖాళీల వివరాలు

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా CISF మొత్తం 451 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులు 268, కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులు 183 ఉన్నాయి. సంస్థ అధికారిక వెబ్‌సైట్ cisfrectt.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ ఫిబ్రవరి 22(రాత్రి 11 గంటలు)గా నిర్ణయించారు.

* అర్హత ప్రమాణాలు

CISF రిక్రూట్‌మెంట్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 2023 ఫిబ్రవరి 23 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా అందుకు సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

* ఎంపిక ప్రక్రియ

CISF రిక్రూట్‌మెంట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. రెండో దశలో రాత పరీక్ష ఉంటుంది. మూడో స్టేజ్‌లో మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మూడు దశల్లో క్వాలిఫై అయిన వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు.

* అప్లికేషన్ ప్రాసెస్

అభ్యర్థులు ముందు CISF అధికారిక వెబ్‌సైట్ cisfrectt.inను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలోకి వెళ్లాలి.

అక్కడ రిక్రూట్‌మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

ఇప్పుడు అన్ని వివరాలతో అప్లికేషన్‌ను ఫిల్ చేయండి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

ఆ తరువాత పేమెంట్ చేయండి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.

ఇది కూడా చదవండి : పది అర్హతో.. ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగాలు.. మారిన తేదీలు ఇలా..

* అప్లికేషన్ ఫీజు

జనరల్ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎంఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. అంటే వారు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. అప్లికేషన్ ఫీజును క్రెడిట్ లేదా డెబిట్ రూపే కార్డ్‌లతో పాటు UPI, SBI చలాన్‌ ద్వారా చెల్లించవచ్చు. ఒకసారి చెల్లించిన ఫీజు ఎట్టి పరిస్థితుల్లో వాపసు ఉండదు.

* ఎగ్జామ్ ప్యాట్రన్

ఎగ్జామ్ పేపర్ హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్, ఎనలిటికల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్-టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షను రెండు గంటల్లో పూర్తి చేయాలి. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

First published:

Tags: Central Govt Jobs, CISF, JOBS, Latest jobs

ఉత్తమ కథలు