పోలీస్ ఉద్యోగం మీ కలా? కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 249 హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల్ని ప్రకటించింది. నియామక ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఖాళీల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఖాళీల సంఖ్య గురించి అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ https://cisfrectt.in/ ఫాలో కావాలి. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. అంటే నోటిఫికేషన్‌లో వెల్లడించిన క్రీడల్లో రాణించినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.
సీఐఎస్ఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, క్రీడార్హతల గురించి తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. అభ్యర్థులు తమ దరఖాస్తుల్ని పోస్టులో నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2022 మార్చి 3 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు | 249 |
హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) మేల్ | 181 |
హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఫీమేల్ | 68 |
SSC 2022 Exam Calendar: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కలా? 2022లో రాబోయే జాబ్ నోటిఫికేషన్స్ ఇవే
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 మార్చి 3 సాయంత్రం 5 గంటలు
వయస్సు- 2021 ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 23 ఏళ్లు
విద్యార్హతలు- ఇంటర్మీడియట్ పాస్ కావాలి.
క్రీడార్హతలు- అభ్యర్థులు స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్‌లో రాణించాలి. 2019 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య క్రీడల్లో రాణించినవారికే అవకాశం.
రాణించాల్సిన క్రీడలు- అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, హాకీ, హ్యాండ్‌బాల్, జూడో, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, తైక్వాండో.
దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రయల్ టెస్ట్, ప్రొఫీషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్.
వేతనం- ఎంపికైన వారికి లెవెల్ 4 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.25,500 బేసిక్ సాలరీతో మొత్తం రూ.81,000 వేతనం లభిస్తుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
UPSC CDS 2022: నిరుద్యోగులకు అలర్ట్... 341 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్
Step 1- అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి.
Step 2- నోటిఫికేషన్‌లో వెల్లడించినట్టుగా అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
Step 3- అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
Step 4- రూ.100 ఫీజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ నుంచి పోస్టల్ ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని అఫ్లికేషన్ ఫామ్‌కు జత చేయాలి.
Step 5- వేర్వేరు క్రీడలకు వేర్వేరు పోస్టల్ అడ్రస్‌లు ఉన్నాయి.
Step 6- దరఖాస్తు ఫామ్ సంబంధిత అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పోస్టులో పంపాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Central Government Jobs, CISF, Govt Jobs 2022, Job notification, JOBS