హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CISF Recruitment 2022: టెన్త్‌ అర్హతతో కానిస్టేబుల్ జాబ్స్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్..

CISF Recruitment 2022: టెన్త్‌ అర్హతతో కానిస్టేబుల్ జాబ్స్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా అందుకు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఉన్నత చదువులు చదివిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు (Jobs) తక్కువగా లభిస్తున్నాయి. చాలా మంది నిరుద్యోగులు అవకాశాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ పాసైన నిరుద్యోగులకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి (CISF Recruitment) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cisfrectt.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 21 నుంచి ప్రారంభం కాగా, డిసెంబర్ 20తో ముగియనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 787 పోస్టుల భర్తీ చేయనుంది.

అర్హత ప్రమాణాలు

ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా అందుకు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థుల వయసు 2022 ఆగస్టు 1కి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

AP-TS Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APలో 3వేలు, TSలో 2వేలకు పైగా ఉద్యోగాలు ..

ఎంపిక ప్రక్రియ

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ వంటి మల్టి-లెవల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం లభిస్తుంది. , 2004 జనవరి 1న లేదా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో చేరిన ఉద్యోగులందరికీ వర్తించే “నేషనల్ పెన్షన్ సిస్టమ్‌‌గా పేర్కొనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ పెన్షనరీ ప్రయోజనాలు అందుతాయి.

దరఖాస్తు విధానం

ముందుగా సీఐఎస్‌ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ cisfrectt.inను సందర్శించాలి. హోమ్‌పేజీలో లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆపై కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్-2022 లింక్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్, టెక్స్‌ట్ ఇమేజ్‌ను ఎంటర్ చేయాలి. అవసరమైన అన్ని వివరాలతో అప్లికేషన్‌ను పూర్తి చేసి, తర్వాత పేమెంట్ చేయాలి.

UR, OBC, EWS కేటగిరి అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), మాజీ సైనికుల (ESM) కేటగిరికి చెందిన అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. చివరగా అప్లికేషన్ సాప్ట్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలి.

1969లో సీఐఎస్‌ఎఫ్ ఏర్పాటు

ప్రభుత్వరంగ సంస్థలకు సమగ్ర భద్రత కల్పించాలనే లక్ష్యంతో 1969లో కేవలం మూడు బెటాలియన్లతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటైంది. ఈ దళం అప్పటి నుంచి 1,63,590 మంది సిబ్బందితో ఒక ప్రధాన మల్టి-స్కిల్ సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం CISF దేశం మొత్తం పొడవునా 353 స్థావరాలకు భద్రతను అందిస్తోంది. CISF‌కు సొంత ఫైర్ వింగ్‌ కూడా ఉంది.

అణు వ్యవస్థాపనలు, అంతరిక్ష సంస్థలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, పవర్ ప్లాంట్లు వంటి వాటికి సీఐఎస్‌ఎఫ్ భద్రతను కల్పిస్తుంది. ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు, ఐకానిక్ హెరిటేజ్ స్మారక చిహ్నాలు, ఢిల్లీ మెట్రోకు సైతం రక్షణ కల్పిస్తోంది. అంతేకాకుండా CISF ఒక ప్రత్యేకమైన VIP సెక్యూరిటీ వర్టికల్‌ను కూడా కలిగి ఉంది. ఇది ముఖ్యమైన వ్యక్తులకు రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీని కూడా అందిస్తుంది.

First published:

Tags: Central Government Jobs, Job notification, JOBS, Police jobs